Bhatti Vikramarka: నేడు అన్నీ పార్టీల MPలతో డిప్యూటీ CM భట్టి విక్రమార్క సమావేశం
తెలంగాణ CM నేడు అన్నీ పార్టీల ఎంపీలతో సమావేశం కానున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. MIM, BJP ఎంపీలకు ఫోన్ చేసి మీటింగ్కు రావాలని ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం పంపించారు.
RTC Workers: RTC ఉద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 2.5 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుందని.. అయినా సరే మహా లక్ష్మ పథకంతో ఆర్టీసీ ఉద్యోగులపై పని భారం పెరిగినందుకు డీఏ పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
Harish Rao : తెలంగాణపై చంద్రబాబుకు ప్రేమలేదు...హరీష్ రావు సంచలన కామెంట్స్
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివి అని, సమన్యాయం కోరుకుంటున్నాను అనడం హాస్యాస్పదం అన్నారు.
BIG BREAKING: ఇదేం పద్ధతి.. చంద్రబాబు సర్కార్ పై కేంద్రానికి సీఎం రేవంత్ కంప్లైంట్!
కృష్ణ నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ సీఎం రేవంత్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ కు వారు ఫిర్యాదు చేశారు.
MLC ELECTIONS 2025: కమ్యూనిస్టులకు ఒక ఎమ్మెల్సీ సీటు.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం?
తెలంగాణ సీపీఐ కీలక నేతలు ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఐకి ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని నేతలు కోరినట్లు తెలుస్తోంది.
SLBC tunnel: టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్
SLBC టన్నల్ విషయంలో రేవంత్ రెడ్డి అన్నీ అబద్దాలే మాట్లాడుతున్నారని BRS లీడర్ హరీశ్ రావు అన్నారు. గత ప్రభుత్వంలో SLBC టన్నల్ పనులు జరగలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని.. లేదంటే CM పదవికి రాజీనామా చేస్తావాని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు హరీశ్ రావు.