HCU భూముల విషయంతో తాను షేర్ చేసిన వీడియోలపై కేసు పెడతానంటే పెట్టుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో పలు కీలక విషయాలు వెల్లడించారు. తాను కేసులకు భయపడనన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు బలం ఉందన్నారు. ఇతర పార్టీల ఓటర్లను కూడా కలిసి వారి మద్దతు కూడగడతామన్నారు. మజ్లిస్ పార్టీ మెల్లిగా పెరుగుతుందన్నారు. పాతబస్తీకి పరిమితమైన ఎంఐఎం కొత్త సిటీలో సీట్లు గెలుస్తోందన్నారు. ఎంఐఎంను కంట్రోల్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఆ పార్టీతో ఎంఐఎం జతకట్టి బలోపేతం అవుతోందన్నారు.
వక్ఫ్ పేరుతో వ్యాపారం..
వక్ఫ్ బోర్డు పేరుతో వ్యాపారం చేసే వారే వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాని మండిపడ్డారు కిషన్ రెడ్డి. నిరసనలో సామాన్య ముస్లింలు ఎవరూ పాల్గొనడం లేదన్నారు. తాము తెచ్చిన కొత్త వక్ఫ్ చట్టంతో ఎవరికీ నష్టం లేదన్నారు. ఒక్క రూపాయి దుర్వినియోగం అయ్యే అవకాశం లేకుండా.. గజం భూమి అన్యాక్రాంతం కాకుండా కొత్త చట్టం తెచ్చామన్నారు.
(telugu-news | telugu breaking news | kishan-reddy | revanth-reddy)
HCU భూముల వ్యవహారం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి వీడియోల విషయంలో తనపై కేసు పెట్టుకుంటే పెట్టుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు బలం ఉందన్నారు. ఎంఐఎంను కంట్రోల్ చేస్తామన్నారు.
Kishan Reddy Vs Revanth