తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఈ కింది లింక్స్ ద్వారా తమ ఫలితాలను నేరుగా చెక్ చేసుకోవచ్చు. ఈ సారి 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు ప్రకటించారు. గతాడాది కంటే ఉత్తీర్ణతా శాతం 1.47 శాతం పెరిగింది. గురుకులాల్లో 98 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు కాగా.. ప్రైవేట్ స్కూళ్లలో 94.12 శాతం నమోదైంది. ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది వరకు పది ఫలితాల్లో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, సీజీపీఏ ఇచ్చావారు. కానీ ఈ సారి పలు మార్పులు చేశారు. మార్కులతో పాటు గ్రేడ్లను కూడా ఇచ్చారు. రాత పరీక్ష, ఇంటర్నల్ మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్లను ముద్రించిన మెమోలను అందిచానున్నారు.
https://results.bsetelangana.org
https://results.bse.telangana.gov.in
https://bse.telangana.gov.in
ఇది కూడా చదవండి: TG High Court: గ్రూప్-1 పై టీజీపీఎస్సీకి హైకోర్టు బిగ్‌షాక్..అక్కడే తేల్చుకోమని...
4,629 పాఠశాలల్లో వందశాతం పాస్..
ఈ ఏడాది దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 99.29 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో 73.97 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 4,629 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సారి రెండు స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఆ రెండూ ప్రైవేటువే కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: Nursing Student Killed : యాచకవృత్తి చేస్తూ..కూతుర్ని నర్సింగ్ చదివిస్తున్నారు..కానీ ఇంతలోనే...
ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్లో సప్లమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆయా విద్యార్థులు మే 16లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా ఫలితాలలో బాలికలే పై చేయి సాధించారు. బాలురు 91.32 % ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణత సాధించారు.
(telangana 10th results 2025 | Tg SSC 10th Results 2025 | revanth-reddy)