BIG BREAKING: సీఎం రేవంత్ కు షాకిచ్చిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు.. అలా చేశారేంటి?

నిన్న జరిగిన CLP భేటీకి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఈ ముగ్గురు.. ఎందుకు రాలేదన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

New Update

మంత్రివర్గ విస్తరణ అంశం తెలంగాణ కాంగ్రెస్ కు, సీఎం రేవంత్ కు తలనొప్పిగా మారింది. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న నేతలు స్వరం పెంచారు. తమను అడ్డుకుంటున్న వారిపై, హైకమాండ్ తీరుపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. వివేక్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
ఇది కూడా చదవండి: BREAKING: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు

అయితే నిన్న జరిగిన సీఎల్పీ మీటింగ్ కు మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేబినెట్ విస్తరణలో తమకు చోటు కల్పించాలంటూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు సీఎల్పీ భేటీకి ఎందుకు హాజరు కాలేదనే అంశం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాయకత్వంపై అలిగే వీరు హాజరుకాలేదా? అన్న చర్చ సాగుతోంది. 
ఇది కూడా చదవండి: Bhu Bharati: ప్రతి అప్లికేషన్‌కు ఒక డెడ్‌లైన్‌.. 'భూ భారతి' చట్టం మార్గదర్శకాలివే!

రేవంత్ వార్నింగ్..

ఇదిలా ఉంటే.. నిన్నటి సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ విస్తరణపై పార్టీ నేతలు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. మంత్రివర్గం విస్తరణను అధిష్టానం చూసుకుంటుందన్నారు. పార్టీ లైన్‌ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

(telugu breaking news | latest-telugu-news | revanth-reddy)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు