నెక్ట్స్ సీఎం కవిత.. కేటీఆర్ కాదు.. వైరల్ అవుతున్న రేవంత్ కామెంట్స్!
జైలుకు పోయిన వారంతా సీఎం అవుతారని కేటీఆర్ భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ లాజిక్ నిజమైతే మొదట జైలుకు వెళ్లిన కవిత సీఎం అవుతారన్నారు. కేటీఆర్ కు ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.