రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఎలాంటి అనుమతి ఇవ్వమని తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటూ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..' సినిమా వాళ్లకు చెప్పేది ఒకటే. మీరు సినిమా తీయండి. బిజినెస్ చేసుకోండి, షూటింగ్ కోసం ఎలాంటి పర్మిషన్ ప్రభుత్వం నుంచి సాయం పొందండి. కానీ ఈ సినిమా వల్ల ఒక ప్రాణం పోయింది. అందుకే ఇప్పటి నుంచి సినిమా వాళ్లకు మా ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వదు.. అని అన్నారు. Revanth Reddy Gives Big Shock To Tollywood Also Read : చీరలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. ముసిముసి నవ్వులు చిందిస్తూ బిగ్ బ్రేకింగ్ న్యూస్ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వము - సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి https://t.co/ElUq0gtkc6 pic.twitter.com/z7x3yvnzQE — Telugu Scribe (@TeluguScribe) December 21, 2024 Also Read : లవర్ కోసం 3 మహా సముద్రాలు దాటిన మగ తిమింగలం.. ఈ కథ వింటే మీరూ ప్రేమలో పడతారు ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప2' ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందింది. ఆమె కొడుకు హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇదే ఘటనలో అల్లు అర్జున్ ఓకే రోజు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. Also Read : 'పుష్ప2' ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ.. థియేటర్స్ లో మాత్రమే అంటూ Also Read : పెళ్లి తర్వాత 'బేబీ జాన్' తో బిజీ.. సోషల్ మీడియాలో కీర్తి ఫొటోలు!