రేవంత్ నాయకత్వంలో హరిత విప్లవం వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ

సీఎం రేవంత్‌ రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ హరిత విప్లవం (Green Revolution) వైపు అడుగులు వేస్తోంది. పట్టణ ప్రణాళిక, పునరుత్పాదక శక్తి, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పునరద్ధరణ వంటివి భవిష్యత్తులో తెలంగాణను పచ్చగా, స్థిరంగా ఉండేలా నిర్ధారిస్తోంది.

New Update
Revanth environment

సీఎం రేవంత్‌ రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ హరిత విప్లవం (Green Revolution) వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి చేపడుతున్న చర్యలు.. స్థిరమైన అభివృద్ధికి, పర్యవరణాన్ని రక్షించేందుకు దోహదపడుతున్నాయి. పట్టణ ప్రణాళిక, పునరుత్పాదక శక్తి, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పునరద్ధరణ వంటివి భవిష్యత్తులో తెలంగాణను పచ్చగా, స్థిరంగా ఉండేలా నిర్ధారిస్తోంది.     

రేవంత్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో 75 సరస్సులను పునరుద్ధిరించే ప్రణాళిక కూడా ఉంది. అలాగే మరో 2 వేల సరస్సుల పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు నిర్జీవంగా ఉన్న నీటి వనరులను పునరుద్ధించాయి. జీవవైవిద్యాన్ని పెంపొందిస్తున్నాయి. అలాగే భూగర్భ నీటిని తిరిగి నింపుతున్నాయి. ముఖ్యంగా హైడ్రా ప్రాజెక్టు.. వలస పక్షులను కూడా తిరిగి తెలంగాణకు తీసుకురాగలిగింది.  పునరుజ్జీవం పొందిన సరస్సులోకి ఫ్లేమింగోస్, రెడ్‌ బ్రిస్ట్‌డ్‌ ఫ్లైక్యాచర్స్‌ వంటి పక్షి జాతులు రావడం వల్ల పర్యావరణ పునరుద్ధరణ అనేది ప్రకృతికి, మనుషులకు ఎలా ప్రయోజనం చేకూర్చుతుందో వివరిస్తోంది.       

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌లోని అమిన్‌పూర్‌ లేక్‌లోకి అరుదైన రెడ్‌ బ్రీస్టెడ్ ఫ్లైక్యాచర్స్‌ వచ్చాయని ఎక్స్‌లో ట్వీట్‌ చేయడమే ఇందుకు చక్కటి ఉదాహరణ. అంతేకాదు రేవంత్ సర్కార్.. రాష్ట్రంలో ప్రభుత్వ రవాణాలో కూడా ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకొచ్చింది. డీజిల్‌తో నడిచే బస్సుల స్థానంలో ఈ ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకురావడం వల్ల నగరంలో గాలికాలుష్యం కూడా గణనీయంగా తగ్గింది. అలాగే పట్టణ, శివారు ప్రాంతాల్లో అటవీకరణ డ్రైవ్‌లు చేయడం రాష్ట్రానికి మరింత పచ్చదనాన్ని తీసుకొచ్చాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి తట్టుకునేందుకు హైదరబాద్‌ను సిద్ధం చేసేందుకే ఈ పనులు చేపట్టారు. 

జీరో కర్బన ఉద్గారాల దిశగా రేవంత్ ప్రభుత్వం ముందుకు రావడం గేమ్‌ఛెంజర్ లాంటింది. ఈ స్థిరమైన ప్రాజెక్టులు.. పునరుత్పాదక శక్తి, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ సాంకేతికతలను ఏకీకృతం చేస్తాయి. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో వర్షపు నీటిని నిల్వచేసుకునే టెక్నాలజీ వినియోగించడం వల్ల నీటి సంక్షోభం బారిన పడకుండా కాపాడుతున్నాయి.   

తెలంగాణ విద్యుత్‌ గ్రిడ్‌లోకి సోలార్‌ ప్లాంట్లను తీసుకురావడం అనేది కూడా కర్బ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తోంది. పునరుత్వాద శక్తి వనరుల వైపు అడుగులు వేయడం వల్ల.. భవిష్యత్తు తరాలకు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాక.. ఇంధన భద్రతకు మరింత భరోసా కల్పిస్తుంది. తెలంగాణలో గాంధేయ యాత్ర స్థలాలైన బాపూ ఘాట్‌ లాంటివి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. ఇలాంటి ప్రాజెక్టులు సుస్థిరతను, పర్యావరణ బాధ్యతతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని  మిళితం చేస్తాయి. ఇలాంటి ప్రదేశాల్లోకి వచ్చే పర్యాటకులు.. ప్రకృతిని ఆస్వాదిస్తారు. చరిత్ర గురించి తెలుసుకుంటారు.  

మరోవైపు రాష్ట్రంలో వ్యర్థ నిర్వాణ వ్యవస్థలను కూడా అమలు చేశారు. ఇలాంటి చర్యలు రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించడం, కాలుష్యాన్ని నిరోధించడం, రాష్ట్ర పర్యావరణాన్ని కాపాడేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయి. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్ అనుసరిస్తున్న ఈ విధానాలు కేవలం రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని  పార్టీ నేతలు చెబుతున్నారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు