Hindupuram : అత్తా కోడళ్ల అత్యాచారం కేసు..ఇద్దరు నిందితుల అరెస్ట్!
చిలమత్తూరు మండలంలో శుక్రవారం జరిగిన అత్తాకోడళ్ల అత్యాచారం కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. దుండగులు మహిళల భర్తల్ని కత్తులతో బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు.
చిలమత్తూరు మండలంలో శుక్రవారం జరిగిన అత్తాకోడళ్ల అత్యాచారం కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. దుండగులు మహిళల భర్తల్ని కత్తులతో బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఓ వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి అపరిచిత వ్యక్తులతో 92సార్లు అత్యాచారం చేయించిన కేసుపై ఫ్రాన్స్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీడియో ఆధారాలు ప్రదర్శిస్తున్నపుడు కోర్టులో సాధారణ పౌరులు చూసే అవకాశం కల్పించింది. అవసరమైతేనే వాటిని ప్రదర్శించనున్నారు.
ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ ఐఎస్ సదన్లోని ఓ పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన వారికి ఆశ్రయం కల్పిస్తామని చెప్పి నాగరాజు, సాయిదీప్, రాజు, రోహిత్ దారుణం చేశారు. నిందుతులను అరెస్ట్ చేశారు.
దేశంలో బాలికలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా 2024లో కుటుంబ సభ్యులు లేదా పరిచయం ఉన్న వారిచేత 90 శాతం మంది వేధింపులకు గురైనట్లు కేసుల లెక్కలు చెబుతున్నాయి. 2022లో వెయ్యికిపైగా కుటుంబ హింస కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
శృంగారం, డ్రగ్స్, బ్లాక్ మెయిల్స్ కేసులతో తెలుగు ఇండస్ట్రీ కంపుకొడుతోంది. ఒకవైపు డ్రగ్స్ ఎపిసోడ్ కొనసాగుతుంటే మరోవైపు రాజ్ తరుణ్, జానీ మాస్టర్, హర్షసాయి వంటి వారిపై లైంగిక ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఇండస్ట్రీ పెద్దలు అంతా బాగానే ఉందని బుకాయిస్తే మాత్రం పచ్చి అబద్ధమే.
రేప్ కేసు నమోదుకావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం ఉదయం చెన్నె వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలిని తన ఇంట్లోనే 3 గంటలపాటు విచారించి అనంతరం భరోసా కేంద్రానికి తరలించారు.
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన జూనియర్ డాక్టర్ హత్య కేసు విషయంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీబీఐకు అల్టిమేటం జారీ చేశారు. వచ్చే ఆదివారంలోగా నిందితుడికి ఉరిశిక్ష వేయాలని..బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు.
2018లో హైదరాబాద్లోని నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి హైకోర్టు మరణశిక్ష విధించింది. గతంలో నిందితుడికి రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించగా అతడు హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్థించింది.
తెలంగాణ నాగర్ కర్నూలో జిల్లాలో ఇద్దరు మహిళా కూలీలకు మద్యం తాగించి వినోద్ సింగ్, గజానంద సింగ్ అనే వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. పని ఉందని తీసుకెళ్లి నమ్మించి దారుణానికి పాల్పడ్డారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ రవీందర్ తెలిపారు.