కాళ్లు, చేతులు కట్టేసి ఘోరం.. ఏపీలో మరో మహిళపై గ్యాంగ్ రేప్ ఏపీలో మరో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో మరొక మహిళ బలైంది. తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఓ నర్సరీలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన మహిళపై నలుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. యేసు, ప్రవీణ్, సురేష్, జయప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 02 Nov 2024 | నవీకరించబడింది పై 02 Nov 2024 15:29 IST in క్రైం Short News New Update షేర్ చేయండి AP CRIME: ఏపీలో మరో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో మరొక మహిళ బలైంది. బతుకుదెరువుకోసం పొట్ట చేతపట్టుకుని వచ్చిన అమాయకురాలిని దుర్మార్గులు దారుణంగా హత్యాచారం చేసి హతమార్చారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపుతున్న ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియంలో చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటికి తిరిగి వెళ్తుండగా.. ఒడిశా నుంచి ఉపాధి కోసం వచ్చిన మహిళ కుటుంబం కొంతకాలంగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో నివాసం ఉంటోంది. అయితే బాధితురాలు కొంతకాలంగా బుర్రిలంకలోని ఓ నర్సరీలో పని చేస్తోంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 15న పని ముగించుకుని ఇంటికి తిరుగుప్రయాణమైంది. ఇది గమనించిన నలుగురు యువకులు ఆమెను నర్సరీలోకి లాక్కెళ్లి సమూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె వారినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా మహిళ నోట్లో టవల్ కుక్కి, కాళ్లు, చేతులు కట్టేసి ముక్కు మూసేయడంతో స్పృహ కోల్పోయింది. అయినా వదలని కామాంధులు రేప్ చేసిన తర్వాత పంట కాలువలో ఆమెను పడేసి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికలు.. కమలా హారిస్ పూర్వికుల గ్రామంలో సంబరాలు నలుగురు అరెస్ట్.. ఇక స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. నిందితులు పట్టుబడ్డారు. మహిళ కుటుంబ సభ్యులకు దొరికిన నల్లపూసల దండ, కర్చీఫ్ ఆధారంగా విచారణ చేసిన పోలీసులు.. పొట్టిలంకకు చెందిన నిందితులు దేవర యేసు, వెలుబడి ప్రవీణ్, దాసరి సురేష్, లోకిన జయప్రసాద్ ను అరెస్ట్ చేయగా నిందితులు నేరం అంగీకరించగా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: Owaisi: తిరుమల నీ జాగీరా..నాయుడు! #rape-case #odisa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి