Jani Master: జానీ మాస్టర్‌ ఎక్కడా? బాధితురాలికి వైద్య పరీక్షలు!

రేప్‌ కేసు నమోదుకావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన జానీ మాస్టర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం ఉదయం చెన్నె వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలిని తన ఇంట్లోనే 3 గంటలపాటు విచారించి అనంతరం భరోసా కేంద్రానికి తరలించారు.

New Update
ms

Jani Master: మహిళా జూనియర్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో తనపై రేప్‌ కేసు నమోదుకావడంతో డ్యాన్సర్ జానీ మాస్టర్‌ అజ్ఞాతంలోకి వెళ్లాడు. సోమవారం ఉదయం నుంచి జానీ ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తుండగా.. తని అచూకి కోసం పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి వేట కొనసాగిస్తున్నారు. అలాగే జానీ చివరిగా ఎవరితో మాట్లాడాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అరెస్ట్‌ చేస్తారనే భయంతోనే జానీ మాస్టర్‌ పరారయ్యాడని తెలుస్తోంది.

ఇక బాధితురాలిని తన ఇంట్లోనే 3 గంటలపాటు ముగ్గురు మహిళా పోలీసులు విచారించారు. అనంతరం బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఒక రోజు షూటింగ్‌ టైమ్‌లో వ్యాన్‌లోకొచ్చి ప్యాంట్‌ జిప్‌ తీసి బలవంతం చేశాడని బాధితురాలు ఆరోపించింది. సెక్స్ కోరిక తీర్చమని వేధించాడని, లేదంటే ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. తెలుగు ఫిల్మిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కి కూడా బాధితురాలి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ జరుగుతోందని ఫిల్మిం చాంబర్‌ ప్రకటన విడుదల చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు