మరో ఘోరం.. ఇద్దరు బాలికలపై రెండు రోజులు ఐదుగురు యువకులు అత్యాచారం! ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ ఐఎస్ సదన్‌లోని ఓ పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన వారికి ఆశ్రయం కల్పిస్తామని చెప్పి నాగరాజు, సాయిదీప్, రాజు, రోహిత్ దారుణం చేశారు. నిందుతులను అరెస్ట్ చేశారు. By srinivas 04 Oct 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి TG Crime : తెలంగాణలో మరో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు రెండు రోజులపాటు లైంగిక దాడికి పాల్పడిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. బస్టాండ్ లో ఉన్న బాలికలకు ఆశ్రయం ఇస్తానని నమ్మించి ఒకరి తర్వాత ఒకరు దారుణంగా లైంగిక దాడి చేశారు. అనంతరం బాలికలను తమ చోటికి చేరుస్తామని నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతుండగా.. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పునరావాస కేంద్రం నుంచి పారిపోయి.. హైదరాబాద్ లోని సైదాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జనగామకు చెందిన బాలిక(14) మూడు నెలల నుంచి, మల్కాజిగిరికి చెందిన బాలిక(15) సెప్టెంబరు 18 నుంచి ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో ఓ ప్రైవేటు సంస్థ పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇద్దరికీ తల్లిదండ్రులున్నా ఇతర సమస్యలతో వారిని పునరావాస కేంద్రంలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఇద్దరు బాలికల మధ్య స్నేహం మొదలైంది. కొద్ది రోజులకు అక్కడ ఉండలేక పారిపోవాలని ప్లాన్ చేశారు. సెప్టెంబరు 24న కిటికీ నుంచి దూకి వెళ్లిపోయారు. అదే రాత్రి 8 గంటల సమయానికి జనగామ బస్టాండ్ చేరుకున్నారు. అక్కడే పాన్‌షాప్ నిర్వాహిస్తున్న సాయిదీప్ దగ్గర ఫోన్ తీసుకుని నాగరాజు అనే యువకుడికి ఒక బాలిక ఫోన్ చేసింది. నాగరాజు వచ్చి ఆమెను తీసుకెళ్లగా ఇంకొక బాలిక అక్కడే ఉండిపోయింది. ఆశ్రయం కల్పిస్తామని దారుణం.. ఈ క్రమంలోనే మరో బాలికను గమనించిన పాన్ షాప్ యువకుడు సాయిదీప్.. ఆమెకు ఆశ్రయం కల్పిస్తానని బేకరీకి తీసుకెళ్లాడు. అక్క సాయిదీప్, మరోయువకుడు రాజు ఇద్దరు కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత రాత్రి తీసుకెళ్లిన బాలికను నాగరాజు సెప్టెంబరు 25న ఉదయం జనగామ బస్టాండులో వదిలేశాడు. అయితే వారిద్దరని మరోసారి గమనించిన సాయిదీప్, రాజు.. తమ ఫ్రెండ్స్ అఖిల్, రోహిత్ లకు సమాచారం ఇవ్వడంతో వారంతా కలిసి బాలికలను హైదరాబాద్ పునరావాస కేంద్రానికి తీసుకెళ్తామని నమ్మించారు. దీంతో కారు ఎక్కిన బాలికలను నిర్మాణుష్య ప్రాంతాల్లో తిప్పుతూ కారులోనే లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఇద్దరినీ బస్టాండ్ సమీపంలో వదిలివెళ్లగా.. పోలీసులు పట్టుకుని సైదాబాద్ పునరావాస కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే బాలికలకు కౌన్సిలింగ్ ఇస్తుండగా.. లైంగిక దాడి జరిగినట్లు తెలిపారు. దీంతో వెంటనే ఐ ఐదుగురు యువకులను పట్టుకుని పోక్సో కేసు నమోదు రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు. Also Read : ట్రోలింగ్ చేయిస్తున్నాడని.. హర్ష సాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు #rape-case #sexual-assault #janagam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి