భార్యపై 92 రేప్ లు చేయించిన భర్త కేసు.. కోర్టు కీలక నిర్ణయం

ఓ వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి అపరిచిత వ్యక్తులతో 92సార్లు అత్యాచారం చేయించిన కేసుపై ఫ్రాన్స్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీడియో ఆధారాలు ప్రదర్శిస్తున్నపుడు కోర్టులో సాధారణ పౌరులు చూసే అవకాశం కల్పించింది. అవసరమైతేనే వాటిని ప్రదర్శించనున్నారు.

New Update
France,

France : యావత్ ఫ్రాన్స్ దేశాన్ని ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యపై దాదాపు 10 ఏళ్లపాటు అత్యాచారాలు చేయించాడు. అయితే అది రెండు మూడుసార్లు కాదు. 72 మంది అపరచిత వ్యక్తులతో ఏకంగా 92 సార్లు అత్యాచారం చేయించాడు. మరి ఈ విషయం ఆమెకు తెలియదా? అంటే తెలియదనే చెప్పాలి. ఎందుకంటే ఆమె తినే ఆహారంలో అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చాడు. ఆపై ఆమె మత్తులోకి వెల్లిన తర్వాత అపరచిత వ్యక్తులతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరికి ఎలా దొరికాడు, పోలీసులు అతడి బాగోతాన్ని ఎలా బయటకు తీశారు, దీనిపై కోర్టు విచారణ ఎలా ఉంది అనే విషయానికొస్తే..

ఫ్రాన్స్ దేశంలో 71 ఏళ్ల డొమినిక్ అనే వ్యక్తి తన భార్యపై దాదాపు 10 ఏళ్ల పాటు అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. ఆమె తినే ఆహారంలో అధిక మోతాదులో డ్రగ్స్ కలిపేవాడు. ఆపై ఆమె నిద్రమత్తులోకి జారుకున్నాక ఆన్లైన్ లో అపరిచితులతో సంప్రదింపులు జరిపి వారితో తన భార్యపై లైంగిక దాడి చేయించేవాడు. వాటిని సీక్రెట్ కెమెరాల్లో రికార్డు చేసేవాడు. 

ఎలా దొరికాడు

అయితే ఇది ఒకటి రెండు ఏళ్లుగా కాదు.. 2011 నుంచి 2020 వరకు అంటే దాదాపు 10 ఏళ్లపాటు ఆమెపై ఈ అఘాయిత్యాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే 2020లో ఓ షాపింగ్ మాల్ లో అతడు ముగ్గురు మహిళలను రహస్యంగా వీడియోలు తీస్తుండగా అక్కడి సెక్యురిటీ గార్డులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించడంతో అతడి ఫోన్, కంప్యూటర్ చెక్ చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి. 

అతడి భార్యపై అపరచిత వ్యక్తులతో లైంగిక దాడులకు పాల్పడ్డ ఫొటోలు, వీడియోలను పోలీసులు గుర్తించారు. వాటి ప్రకారం.. దాదాపు 72 మందితో 92 సార్లు ఆమెపై అత్యాచారం చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఈ 72 మందిలో 26 ఏళ్ల నుంచి 73 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువమందిగా పోలీసులు తెలిపారు. వీరిలో 50 మందిని ఇప్పటికే గుర్తించారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.  

కోర్టు కీలక నిర్ణయం

ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి కీలక నిర్ణయం తీసుకున్నారు. వీడియో ఆధారాలు ప్రదర్శిస్తున్నపుడు కోర్టులో సాధరణ పౌరులు కూడా చూసే అవకాశం కల్పించారు. అయితే సున్నిత మనసు గల వారు, మైనర్లు కోర్టు పరిసరాల్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గమనించాల్సిన విషయం ఏంటంటే.. నిజా నిజాలను వెలికితీసే క్రమంలో అవసరమైతేనే వాటిని ప్రదర్శించనున్నారు. 

Also Read :  రైతులకు గుడ్‌న్యూస్‌.. ఈరోజే రూ.2 వేలు జమ

Advertisment
Advertisment
తాజా కథనాలు