Raksha Bandhan 2025: రాఖీ కట్టడానికి సరైన సమయం ఏది?
ఈ ఏడాది ఆగస్టు 09న రాఖీ పౌర్ణమి వచ్చింది. అయితే.. ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 1.32 గంటల వరకు రాఖీ కట్టడం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 2:07 గంటల నుంచి రాత్రి 08:00 గంటల వరకు మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టాలని సూచిస్తున్నారు.