Rakhi Festival 2025: తక్కువ బడ్జెట్‌లో అదిరి పోయే గిఫ్ట్...రక్షా బంధన్ స్పెషల్..

సోదర-సోదరీమణుల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగ ఆగస్టు 9న జరగనుంది. ఈ రోజున సోదరుడు సోదరికి మర్చిపోలేని బహుమతులను తక్కువ బడ్జెట్ ఇవ్వచ్చు. ఈ ప్రత్యేకమైన బహుమతుల గురించి తెలుసుకోవాలంటే ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Rakhi Festival 2025

Rakhi Festival 2025

మానవా సంబంధాల్లో సోదర-సోదరీమణుల బంధం అపురూపమైనది. రాఖీ పండుగ(Rakhi Festival) ఈ బంధాన్ని మరింత దృఢం చేస్తుంది. ఈ పవిత్రమైన రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి దీర్ఘాయువు కోరుకుంటారు. దానికి ప్రతిఫలంగా అన్నదమ్ములు తమ సోదరీమణులకు ప్రేమతో బహుమతులు ఇచ్చి. ఎల్లప్పుడూ అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు. ఈ బహుమతులు కేవలం వస్తువులు మాత్రమే కాకుండా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవం, అనురాగానికి గుర్తుగా నిలుస్తాయి. సోదర-సోదరీమణుల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగ ఆగస్టు 9న జరగనుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి సోదరుడు తన సోదరికి ఒక మర్చిపోలేని బహుమతి ఇవ్వాలని కోరుకుంటాడు. కానీ.. బడ్జెట్ తక్కువగా ఉండి అంటే రూ.1000 లోపు.. ఏం ఇవ్వాలో తెలియక తికమక పడుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని ప్రత్యేకమైన బడ్జెట్ ఫ్రెండ్లీ బహుమతులు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

తక్కువ బడ్జెట్‌లో ప్రత్యేకమైన బహుమతులు:

పర్సనలైజ్డ్ బహుమతులు: మీ ఇద్దరి ఫొటో ఉన్న మగ్గు, కుషన్, కీచైన్ లేదా ఫొటో ఫ్రేమ్ ఇవ్వవచ్చు. ఇది మీ అనుబంధానికి ఒక గుర్తుగా నిలుస్తుంది.

స్కిన్ కేర్ కిట్: మీ సోదరికి చర్మ సంరక్షణ పట్ల ఆసక్తి ఉంటే.. ఒక చిన్న స్కిన్ కేర్ కాంబో కిట్ ఇవ్వవచ్చు. ఇందులో ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, ఫేస్ మాస్క్ వంటివి ఉంటాయి.

మినీ మేకప్ కిట్:మేకప్ ఇష్టపడే సోదరి కోసం చిన్న మేకప్ కిట్ ఇవ్వవచ్చు. ఇందులో లిప్‌స్టిక్, కాజల్, బ్లష్, నెయిల్ పాలిష్ వంటివి ఉంటాయి.

ఇది కూడా చదవండి: ఈ రెండు సమయాల్లో రాఖీ కడితే.. అన్నీ అశుభాలే!

LED ఫోటో క్లిప్ లైట్స్:మీ సోదరికి గదిని అందంగా అలంకరించడం ఇష్టమైతే.. ఈ లైట్స్ సరైన ఎంపిక. దీనికి ఇష్టమైన ఫొటోలను క్లిప్ చేయవచ్చు.. దీనితో గదికి డ్రీమ్ లుక్ వస్తుంది.

స్లింగ్ బ్యాగ్-ట్రెండీ వాటర్ బాటిల్:కాలేజీకి, ఆఫీస్‌కి వెళ్లే సోదరి కోసం స్టైలిష్ స్లింగ్ బ్యాగ్ ఇవ్వవచ్చు. అలాగే.. ట్రెండీగా ఉండే స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిల్ కూడా ఒక మంచి ఎంపిక. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది.

పెర్ఫ్యూమ్-బాడీ మిస్ట్:మంచి సువాసన ఇష్టపడే సోదరికి పెర్ఫ్యూమ్ లేదా బాడీ మిస్ట్ ఇవ్వడం ఒక క్లాసీ గిఫ్ట్‌గా ఉంటుంది. ఈ బహుమతులు కేవలం బడ్జెట్ ఫ్రెండ్లీ మాత్రమే కాకుండా.. సోదరికి తప్పకుండా నచ్చుతాయి.

ఇది కూడా చదవండి: రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముళ్లు వేయాలి? 1 లేదా 2 అనేది తెలియకుండా రాఖీ కడితే అంతే సంగతులు

Advertisment
తాజా కథనాలు