SSMB29 : అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.. ఈ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ SSMB29 కోసం యావత్ ప్రపంచ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ SSMB29 కోసం యావత్ ప్రపంచ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ టీజర్ వచ్చేసింది. శివగామి గంభీరమైన డైలాగ్‌తో మొదలైంది. "బాహుబలి మరణం ఒక ముగింపు కాదు... అది ఒక మహా కార్యానికి ప్రారంభం... తన గమ్యం యుద్ధం" అనే మాటలు కథపై మరింత ఆసక్తిని పెంచాయి. కొన్ని సీన్లు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
బాక్సఫిస్ రికార్డులను తిరగరాసిన 'బాహుబలి' పదేళ్ల తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. పార్ట్ 1, పార్ట్ 2 రెండు కలిపి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు రాజమౌళి. ఆయితే ఈ మూవీలో చేసిన మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
“బాహుబలి: ది ఎపిక్” ప్రీమియర్ షోస్ పూర్తయ్యాయి. రాజమౌళి కొత్త ఎడిటింగ్, విజువల్స్‌తో అద్భుతంగా చూపించారు. ప్రభాస్ నటన, కీరవాణి సంగీతం, ఎమోషనల్ క్లైమాక్స్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. చివర్లో “బాహుబలి: ది ఎటర్నల్ వార్” టీజర్ చూపించారు.
“బాహుబలి: ది ఎపిక్” రీ-రిలీజ్లో రాజమౌళి సర్ప్రైజ్గా “బాహుబలి: ది ఎటర్నల్ వార్” టీజర్‌ను చూపించనున్నారు. ఇది ₹120 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన 3D యానిమేటెడ్ చిత్రం. బాహుబలి ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించనున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది.
“బాహుబలి: ది ఎపిక్” అక్టోబర్ 31న రీ-రిలీజ్ అవుతోంది. 3 గంటలు 45 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాలో, అవంతిక ప్రేమకథ, మూడు పాటలు, కొన్ని యుద్ధ సన్నివేశాలు తొలగించారు. ప్రీ-సేల్‌లోనే రికార్డు వసూళ్లు సాధించి, అన్ని భాషల్లో భారీ ఓపెనింగ్‌కి సిద్ధమవుతోంది.
రాజమౌళి బాహుబలి 3ను ఈసారి యానిమేటెడ్ ఫార్మాట్లో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. కథ, స్క్రిప్ట్ పనులు ఆయన పర్యవేక్షించనున్నారని సమాచారం. దీంతో బాహుబలి 3 కనీసం వెయ్యి కోట్ల వసూళ్లు రాబడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బాహుబలి సిరీస్‌ను “బాహుబలి: ది ఎపిక్”గా మళ్లీ థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. రెండు భాగాలను కలిపిన ఈ స్పెషల్ ఎడిషన్ అక్టోబర్ 31న విడుదల కానుంది. IMAX, 4DX వంటి ఫార్మాట్లలో రాబోతున్న ఈ సినిమా అమెరికాలో ఇప్పటికే భారీ బుకింగ్స్‌తో సంచలనం సృష్టిస్తోంది.
బాహుబలి రీ-ఎడిట్ వెర్షన్ అక్టోబర్ 31న విడుదల కానుంది. 3.45 గంటల నిడివితో మళ్లీ వెండి తెరపై సందడి చేయనుంది. అమెరికాలో ప్రీమియర్ షోలకు ఇప్పటికే $100K బుకింగ్స్ దాటింది. IMAX, 4DXలో విడుదల అవుతూ, మరోసారి బాక్సాఫీస్ రికార్డులు తెరగరాస్తోంది.