/rtv/media/media_files/2026/01/12/director-anil-ravipudi-2026-01-12-13-32-26.jpg)
director anil ravipudi
Anil Ravipudi: ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ కొట్టడమే కష్టం, అలాంటిది కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుసగా విజయాలు అందుకుంటున్నారు కుర్ర డైరెక్టర్ అనిల్ రావిపూడి. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి తర్వాత ఈ రికార్డు మన అనిల్ రావిపూడికే సొంతమని చెప్పొచ్చు. ప్లాప్ లేని పర్ఫెక్ట్ డైరెక్టర్ గా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు.
వరుస హిట్స్
పటాస్ మొదలుకొని ఈరోజు రిలీజైన మెగాస్టార్ 'మన శంకర వరప్రసాద్ గారు' వరకు తన సక్సెస్ స్ట్రీక్‌ను కొనసాగించారు. మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ కామెడీ రోల్‌లో చూపిస్తూ, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా అనిల్ రాసిన సీన్లు థియేటర్లను నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. ఈ సినిమా 2026 మొదటి బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాకుండా, అనిల్ రావిపూడికి వరుసగా 9వ విజయాన్ని అందించింది.
100% సక్సెస్ రేట్
బాలకృష్ణతో 'భగవంత్ కేసరి', చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్'.. ఇలా పెద్ద హీరోల ఇమేజ్‌ను దెబ్బతీయకుండానే తన మార్క్ కామెడీని జోడించడం అనిల్ కు మాత్రమే సాధ్యమని ప్రేక్షకుల అభిప్రాయం. సినిమా కథ ఏదైనా, అందులో కామెడీని ఆర్గానిక్‌గా పండించడం ఆయన ప్రత్యేకత. అంతేకాదు ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారిపోయారు. టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత 100% సక్సెస్ రేట్ ఉన్న ఏకైక దర్శకుడు అనిల్ రావిపూడి అనిపించుకున్నారు.
Also Read: Chiranjeevi: ఈ ఏడాది ఆ ఘనత మెగాస్టార్ దే.. సంబరాలు షురూ
Follow Us