/rtv/media/media_files/2025/11/21/prabhas-2025-11-21-18-42-54.jpg)
Prabhas
Prabhas: భారత సినిమా చరిత్రలో మైలురాయి చిత్రంగా నిలిచిన ‘బాహుబలి’ ఇప్పుడు కొత్త రీ- ఎడిట్ వెర్షన్ లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) ఈ చిత్రం రెండు భాగాల కథను ఒక్క సీరియస్ ఎపిక్‌గా ‘బాహుబలి: ది ఎపిక్’(Baahubali The Epic) పేరుతో విడుదల చేశారు. ఇది సాదాసీదా రీ-రిలీజ్ కాదు, పూర్తిగా డిజిటల్‌గా రీ-ఎడిట్, రీ-మాస్టర్ చేయబడిన ప్రత్యేక వెర్షన్.
ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31, 2025న విడుదలైన ఈ కొత్త వెర్షన్, ఇప్పటికే మంచి వసూళ్లను సాధిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ PCX స్క్రీన్ లో భారీ క్యూలు ఏర్పడ్డాయి. సినిమాను Cinemascope, IMAX, Dolby Vision వంటి పెద్ద స్క్రీన్ ఫార్మాట్లలో రిలీజ్ చేయడం వల్ల విజువల్ అనుభవం మరింత పెరిగింది.
Prabhas Watched Baahubali The Epic
Rebel Star Prabhas spotted at Prasads Multiplex watching Baahubali – The Epic Movie!
— BommaTV (@bomma_tv) November 21, 2025
Fans were excited to see him enjoy the legendary classic again! 🔥👑#Prabhas#RebelStar#Baahubali#PrasadsMultiplex#SSRajamouli#Tollywood#EpicCinemapic.twitter.com/HdCXDqTGbY
తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ ఈ ప్రత్యేక ఎడిషన్‌ను మళ్లీ వీక్షించారని తెలిసింది. అందుకు సంబందించిన కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, సినిమా చూసాక ఆయన ఫీలింగ్స్, అనుభవం మీడియాతో పంచుకుంటారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇక బాహుబలిలో ప్రభాస్ తో పాటు రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్య కృష్ణన్, సత్యరాజ్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. సంగీతం ఎం.ఎం. కీరవాణి అందించారు, ఈ సినిమాలోని బ్లాక్‌బస్టర్ సాంగ్స్ ప్రేక్షకులను మళ్లీ మంత్రముగ్ధులుగా చేసాయి.
నిర్మాత శోభు యార్లగడ్డ ఈ కొత్త వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3000 థియేటర్లలో విడుదలైందని తెలిపారు. అమెరికాలో 400 స్క్రీన్లు, గల్ఫ్ దేశాలు, యూరోప్ ప్రాంతాల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇది రెండు భాగాల కథను ఒక్క సినిమా రూపంలో చూపించే ప్రయత్నం, అందరినీ ఆకట్టే విధంగా విజువల్ ట్రీట్ అందిస్తోంది.
ప్రస్తుతం, ‘బాహుబలి: ది ఎపిక్’ థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రేక్షకులు, అభిమానులు పెద్ద స్క్రీన్ Experience కోసం సినిమా థియేటర్లలో ది లెజెండరీ బాహుబలిని మళ్లీ ఆస్వాదిస్తున్నారు. ప్రభాస్ ఈ ఎపిక్‌ను చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Follow Us