Prakash Raj : వారణాసిలో నా పాత్ర ఇదే.. ప్రకాశ్‌రాజ్‌ వీడియో వైరల్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న లేటెస్ట్‌ మూవీ వారణాసి. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా ..  విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

New Update
prakash

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న లేటెస్ట్‌ మూవీ వారణాసి. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా ..  విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇంతకు ఇందులో ఆయన పాత్ర ఏంటి అన్నది క్లారిటీ లేదు.  మహేష్ బాబుకు తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారంటూ వార్తలు వచ్చాయి . తాజాగా ఓ ఇంటర్వ్యూలో  ప్రకాష్ రాజ్ తన పాత్రపై వివరణ ఇచ్చారు.  
 
వారణాసి చిత్రంలో తాను శివుడి భక్తుడిగా నటిస్తున్నానని తెలిపారు. తనలోని నటుడి ఆకలిని వారణాసి చిత్రం తీర్చిందంటూ ప్రకాశ్‌రాజ్‌ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా హిందీ దృశ్యం 3లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  కాగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా తదుపరి షూటింగ్ షెడ్యూల్ జార్జియాలో జరగనున్నట్లు సమాచారం.  ఈ షెడ్యూల్ లో  మహేశ్‌తో పాటు ఇతర  నటినటులపై  కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.  వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ఈ చిత్రం విడుదల కానుంది.

50% పైగా షూటింగ్ పూర్తి

రాజమౌళి ఈ సినిమా కోసం ట్రూ ఐమాక్స్  ఫార్మాట్‌ను వాడుతున్నారు. ముఖ్యంగా కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, రామాయణ ఎపిసోడ్ స్క్రీన్ పై అద్భుతంగా ఉండబోతున్నాయని సమాచారం. ప్రస్తుతం 50% పైగా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే అడ్వెంచరస్ పాత్రలో కనిపిస్తున్నారు. టీజర్‌లో త్రిశూలం పట్టుకుని, తెల్లటి ఎద్దుపై వచ్చే మహేష్ లుక్ తెగ వైరల్ అయ్యింది. ఇందులో ఆయన రామాయణ నేపథ్యమున్న సీక్వెన్స్‌లో రాముడిగా కూడా కనిపించబోతున్నారు.

Advertisment
తాజా కథనాలు