Rain Alert: రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..అత్యవసరం అయితేనే బయటకు రండి!
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు వివరించారు.