IMD : ఈ నెల 8 వరకు భారీ వర్షాలు: ఐఎండీ ఎండీ!
తెలుగు రాష్ట్రాల్లో మరోసారిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో మరోసారిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
విజయవాడలో బుధవారం రాత్రి మరోసారి భారీ వర్షం కురిసింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు మళ్లీ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బుడమేటి వరద నిలకడగా ఉండగా, ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
నేటి నుంచి మరో 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది.ఆ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వివరించారు.
భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఆహరం లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలెబ్రెటీలు విపత్తు బాధితులకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. హీరో NTR, సిద్దు, విశ్వక్ తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటించారు.
వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పెనుప్రమాదం తప్పింది. ఆయన పర్యటిస్తున్న బోటు ఒక్కసారిగా పక్కకి ఒరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది..బోటును తిరిగి యథాస్థితికి తీసుకుని వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణలోని చాలా ఊర్లకు సంబంధాలు తెగిపోయాయి. పలు జిల్లాల్లోని గ్రామాలకు వెళ్లే రోడ్లు దెబ్బతినడం వల్ల సుమారు 117 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల్లో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు అధికారులకు సాయంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు.
ఆదివారం అర్థరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.