/rtv/media/media_files/2024/10/22/u5HRAnrHsty3gHFaBRxX.jpg)
Rains
ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఢిల్లీతో పాటు పంజాబ్‌లో కూడా భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేసింది. ఇప్పటికే ఢిల్లీలోని వాతావరణం మారిపోయింది. మొత్తం మేఘాలతో రాష్ట్రం కమ్ముకుపోయింది.
ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!
తీవ్రమైన చలి
సాధారణంగానే ఢిల్లీలో ఎక్కువగా చలి ఉంటుంది. దీనికి తోడు వర్షాలు కురిస్తే.. ఇంకా చలి తీవ్రత పెరిగిపోతుంది. రోజంతా చల్లటి గాలులతో తేలికపాటి మంచు కూడా పడనుంది. మళ్లీ ఫిబ్రవరి 6వ తేదీ తర్వాత వాతావరణ సర్దుకుంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి ఢిల్లీతో పాటు కొండ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవున్నాయి.
ఇది కూడా చూడండి: Israel: నెతన్యాహు సతీమణి పై నేర విచారణ!
ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో గత రెండు వారాల నుంచి ఉష్ణోగ్రతలు నిరంతరం తగ్గుతున్నాయి. వాతావరణంలో మార్పులు రావడంతో వర్షాలు కురవడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఇది కూడా చూడండి: Vasant Panchami : నేడు వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు