Rain alert : హైదరాబాద్ లో భారీ వర్షం...దంచికొడుతున్న వాన
తెలంగాణలో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతోంది. ఈ రోజు ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా ఛేంజ్ అయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Ap Rain Alert:ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు!
ఉత్తరాంధ్రలో శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, శ్రీకాకుళం, విజయనగరంలో వడగాలులు తీవ్రంగా ఉంటాయి. ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపారు.
Rains alert : బయటకు వెళ్తున్నారా? జర జాగ్రత్త...రెండురోజులపాటు దంచుడే దంచుడు
తెలంగాణలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.
Rain Alert : మరో మూడు రోజులు దంచుడే దంచుడు
రాష్ట్రంలో వైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలు పెరుగుతుండడంతో జనం వేడికి అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ని అందించింది. తెలంగాణలో రానున్న మూడురోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana: ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు బుధ, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది.
Telangana: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. !
అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసులు క్షేత్రస్థాయిలో ఉండి ట్రాఫిక్ సమస్యను ఎక్కడికక్కడ పరిష్కరించాలని చెప్పారు.