Rain Alert: మునిగిపోయిన బెంగళూరు.. ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

బెంగళూరు నగరంలో ఆదివారం భారీ వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో దాదాపు 40 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, వంటి ప్రాంతాలు నీట మునిగాయి.

New Update

Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రానున్న 5 రోజులు   భారీ నుంచి  అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖా హెచ్చరించింది. మే 18 ఆదివారం రోజు బెంగళూరు నగరంలో ఈ సీజన్‌లోనే  అతిపెద్ద వర్ష పాతం  నమోదైంది. అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. 24 గంటల్లో దాదాపు 40 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 

మునిగిన బెంగళూర్ 

మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, బాగలకుంటె, జక్కూరు, హొరమావు, శెట్టిహళ్లి, విశ్వేశ్వరపురా, విద్యాపీఠ, హెమ్మిగెపురా, సిల్క్ బోర్డ్ లో ప్రాంతాలు నీట మునిగాయి.  లోతట్టు ప్రాంతాల్లో   వర్షపు  నీరు ఇళ్లలోకి ప్రవేశించాయి.  దీంతో కుటుంబాలను ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. భారీ  వర్షంతో  అనిల్ కుంబ్లే జంక్షన్ నుంచి BRV జంక్షన్ వరకు,  బేలిమఠ జంక్షన్ నుంచి బిన్నీమిల్ దిశగా భారీ ట్రాఫిక్ ఏర్పడింది. 

బెంగళూరుకు ఎల్లో అలర్ట్

 బెంగళూరు సహా 22 జిల్లాలకు వాతావరణ శాఖ ‘యెల్లో అలర్ట్’ ప్రకటించింది.  మే 22 వరకు ఉడిపి, బెలగావి, ధారవాడ, గడగ్, హవేరి ప్రాంతాల్లో 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు  ప్రయాణించవద్దని సూచించింది. 

rain-alert | Bengaluru rains | latest-news | telugu-news | weather-update 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు