ఇట్స్ అఫీషియల్.. పుష్ప2 ఐటెం సాంగ్ లో శ్రీలీల.. పోస్టర్ బ్లాక్ బస్టర్
పుష్ప2 మూవీలో ఐటెం సాంగ్ కోసం మేకర్స్ శ్రీలీలను సెలెక్ట్ చేశారు. ఈ మూవీలో కిస్సిక్ అనే సాంగ్ లో ఆమె తన డ్యాన్స్ ఇరగదీసేస్తుందని తెలిపారు. అందుకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
పుష్ప2 మూవీలో ఐటెం సాంగ్ కోసం మేకర్స్ శ్రీలీలను సెలెక్ట్ చేశారు. ఈ మూవీలో కిస్సిక్ అనే సాంగ్ లో ఆమె తన డ్యాన్స్ ఇరగదీసేస్తుందని తెలిపారు. అందుకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2' లో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తున్నారనేది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో పుష్ప సెట్స్ నుంచి లీకైన శ్రీలీల ఫొటో వైరల్ గా మారింది. దీంతో పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో బన్నీతో స్టెప్పులేసింది శ్రీలీల అని క్లారిటీ వచ్చేసింది.
'పుష్ప 2' స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో స్టెప్పులేసేది ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. యంగ్ సెన్సేషన్ శ్రీలీలను 'పుష్ప 2' స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారట మేకర్స్. నవంబర్ 6 నుంచిరామోజీ ఫిలిం సిటీలో ఈ పాట చిత్రీకరణ మొదలు కానుందని సంచారం.
‘పుష్ప 2’ చివర్లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్నారట సుకుమార్. ‘పుష్ప 2’ చివర్లో ఓ వాయిస్ ఓవర్ ఉంటుందని.. ఆ వాయిస్ సినిమా తదుపరి భాగానికి హింట్ ఇస్తుందని టాక్ వినిపిస్తోంది. వాయిస్ ఓవర్ కోసం మేకర్స్ స్టార్ హీరోని తీసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.
హైదరాబాద్ లో నెల రోజులపాటు 144 సెక్షన్ విధించారు. దీని ప్రకారం సభలు, సమావేశాలు నిషేధం. ఇదికాస్త 'పుష్ప 2' మూవీ టీమ్ కు తలనొప్పిగా మారింది. నవంబర్ లోనే 'పుష్ప 2' ఈవెంట్ ప్లాన్ చేయగా.. పోలీసుల ప్రకటనతో ఈ ఈవెంట్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంది.
మైత్రీ మూవీస్ నిర్మాతలు 'పుష్ప 2' కు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో జానీ మాస్టర్ కి బెయిల్ రావడంతో 'పుష్ప 2'లో సాంగ్ ఆయనే కంపోజ్ చేస్తున్నారా?' అని అడగ్గా.. ఆల్రెడీ కొరియోగ్రాఫర్ మార్చేసాము. వేరే కొరియోగ్రాఫర్ తో సాంగ్ షూట్ చేయిస్తున్నామని నిర్మాత తెలిపారు.
మైత్రీ మూవీస్ నిర్మాతలు 'పుష్ప 2' కు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో మెగా, అల్లు ఫ్యాన్స్ విబేధాలపై క్లారిటీ ఇచ్చారు. మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే. అల్లు అర్జున్ కు ఏ పార్టీతో సంబంధం లేదు. ఫ్యాన్స్ కు, హీరోలకు రాజకీయాలతో ముడిపెట్టొద్దని అన్నారు.
'పుష్ప 2' రిలీజ్ డేట్ ను ఒక్క రోజు ముందుకు జరిపారు. డిసెంబర్ 5 నే సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్ వదిలారు. అందులో అల్లు అర్జున్ నోట్లో సిగార్, చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్ లుక్లో కనిపించాడు.