Thaman : దేవిశ్రీప్రసాద్ కు బిగ్ షాక్.. 'పుష్ప2' లోకి తమన్ ఎంట్రీ

'పుష్ప2' కోసం తమన్ రంగంలోకి దిగారట. ఆల్రెడీ బీజియం వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు పది రోజుల పాటూ తమన్ బీజియం వర్క్ పై దృష్టి సారించనున్నారట. సుకుమార్ దగ్గరుండి మరీ తమన్ నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేలా శ్రద్ద తీసుకుంటున్నట్లు సమాచారం.

New Update
sdgxcb

'పుష్ప2'  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో సుకుమార్.. DSP ని కాదని థమన్, అజనీష్ లోకనాథ్ లను తీసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. బిగ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ మూవీ కాస్టింగ్ దగ్గర్నుంచి టెక్నీకాలిటీ వరకూ ప్రతీదీ ది బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేలా  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also Read :  బిగ్ బాస్ చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు..! పాపం టేస్టీ తేజ

ఇదిలా ఉంటే 'పుష్ప' పార్ట్-1 బీజియం విషయంలో సుకుమార్ సాటిస్పై అవ్వలేదట. నిజానికి మ్యూజిక్ పరంగా చూసుకుంటే 'పుష్ప పార్ట్-1' సాంగ్స్ హైలైట్ గా నిలిచినప్పటికీ బీజీఎమ్ యావరేజ్ అంటూ విమర్శలు వచ్చాయి. దానికి తోడూ మిక్సింగ్ కూడా ఏమాత్రం బాలేదని టాక్ వచ్చింది.

Also Read : ఎవరీ హానీసింగ్..? ఆసక్తికరంగా నితిన్ 'రాబిన్ హుడ్' టీజర్

రంగంలోకి తమన్..

అందుకే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సుకుమార్ దేవిశ్రీ స్థానంలో తమన్ ను తీసుకున్నారని గత కొద్దీ రోజులుగా ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆ ప్రచారమే నిజమైనట్లు తెలుస్తోంది. 'పుష్ప2' కోసం తమన్ రంగంలోకి దిగారట. ఆల్రెడీ బీజియం వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

Also Read :  డిస్టెన్స్ రిలేషన్ షిప్‏లో ఈ తప్పులు చేస్తే బంధం ముక్కలే..!

సుమారు పది రోజుల పాటూ తమన్ బీజియం వర్క్ పై దృష్టి సారించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అటు సుకుమార్ కూడా దగ్గరుండి మరీ తమన్ నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేలా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది దేవిశ్రీ ప్రసాద్ కు భారీ షాక్ అని చెప్పక తప్పదు. మరి 'పుష్ప2' బీజియంతో తమన్ థియేటర్స్ లో మోత మోగిస్తాడేమో చూడాలి.

Also Read : ఆ డైరెక్టర్ నన్ను కమిట్మెంట్ అడిగాడు.. షాకింగ్ విషయం బయటపెట్టిన 'విశ్వం' హీరోయిన్

#tollywood #pushpa-2 #devisriprasad #allu arjun pushpa #s-s-thaman
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు