మెగాస్టార్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న 'పుష్ప' విలన్.. ఏ సినిమానో తెలుసా? కన్నడ హీరో ధనంజయ.. మెగాస్టార్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన 'జీబ్రా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బయటపెట్టాడు. 'వాల్తేరు వీరయ్య' మూవీలో బాబీ సింహా చేసిన పాత్ర తాను చేయాల్సిందని, కొన్ని అనివార్య కారణాల వల్ల అది మిస్ అయిందని చెప్పాడు. By Anil Kumar 13 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ వస్తే ఏ ఆర్టిస్ట్ కైనా అంతకంటే కావాల్సిందేముంది. ఆయన మూవీలో చిన్న రోల్ ఇచ్చినా చాలని అనుకునే నటీ, నటులు చాలా మంది ఉన్నారు. అయితే కొన్ని సార్లు అలాంటి ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అవుతూ ఉంటుంది. ఈ లిస్ట్ లో ఓ కన్నడ హీరో కూడా ఉన్నాడు. అతనెవరో కాదు 'పుష్ప' సినిమాతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన కన్నడ హీరో ధనంజయ. Also Read : రాశీఖన్నా కు బ్రేకప్.. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన హీరోయిన్? ఈ హీరో కన్నడలో మంచి స్టార్ డం తెచ్చుకున్నాడు. 'పుష్ప' సినిమాలో జాలి రెడ్డి పాత్రలో నెగిటివ్స్ షేడ్స్ తో అందర్నీ మెప్పించాడు. ఇక తాజాగా సత్యదేవ్ తో కలిసి 'జీబ్రా' అనే సినిమాలో నటించాడు. నవంబర్ 22 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. Also Read : అతనితో బ్రేకప్ అయింది.. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా : రాశీ ఖన్నా ఆ ఛాన్స్ మిస్ అయింది.. ఈ ఈవెంట్లో ధనుంజయ మాట్లాడుతూ..' చిరంజీవి గారిని ఎప్పట్నుంచో కలుద్దామనుకున్నాను కుదర్లేదు. ఇన్నాళ్లకు ఆ కల తీరింది. చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య సినిమాలో నాకు ఛాన్స్ మిస్ అయింది. అందులో బాబీ సింహ చేసిన పాత్ర నేను చేయాల్సింది. కానీ అనివార్య కారణాలతో ఆ ఛాన్స్ మిస్ అయింది. అప్పుడు చాలా బాధపడ్డాను. Also Read : సినిమాల్లోనే కాదు..రియల్ లైఫ్‌లోనూ హీరోయిన్ అనిపించుకున్న అనన్య మీతో కలిసి నటించాలని ఉంది. ఇవాళ ఇలా ఈ ఈవెంట్లో చిరంజీవి సర్ ని కలవడం ఆనందంగా ఉంది..' అని అన్నాడు. ఇక 'జీబ్రా' సినిమా విషయానికొస్తే.. ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమెడియన్ సత్య, సునీల్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. 'KGF' మూవీ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. Also Read : డాక్టర్ తో డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్ #allu-arjun #tollywood #pushpa villain #pushpa-2 #chiranjeevi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి