జానీ మాస్టర్ కు బెయిలొచ్చింది, 'పుష్ప2' షూట్ లో జాయిన్ అవుతారా? మైత్రీ మూవీస్ నిర్మాతలు 'పుష్ప 2' కు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో జానీ మాస్టర్ కి బెయిల్ రావడంతో 'పుష్ప 2'లో సాంగ్ ఆయనే కంపోజ్ చేస్తున్నారా?' అని అడగ్గా.. ఆల్రెడీ కొరియోగ్రాఫర్ మార్చేసాము. వేరే కొరియోగ్రాఫర్ తో సాంగ్ షూట్ చేయిస్తున్నామని నిర్మాత తెలిపారు. By Anil Kumar 24 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప 2' మూవీకి సంబంధించి నిర్మాతలు నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో డిసెంబర్ 5నే ఈ సినిమా రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. అంతేకాకుండా సినిమా గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వేరే కొరియోగ్రాఫర్ తో.. ఇందులో భాగంగానే ఓ విలేకరి..' జానీ మాస్టర్ కి బెయిల్ రావడంతో పుష్ప 2లో సాంగ్ ఆయనే కంపోజ్ చేస్తున్నారా?' అని మీడియా ప్రశ్నించగా నిర్మాత సమాధానమిస్తూ..' ఆల్రెడీ కొరియోగ్రాఫర్ మార్చేసాము. వేరే కొరియోగ్రాఫర్ తో సాంగ్ షూట్ చేయిస్తున్నాము..' అని తెలిపారు. అంతేకాకుండా ఆ ఐటెం సాంగ్ నవంబర్ 4 నుంచి షూట్ చేయబోతున్నామని, అందులో నటించే హీరోయిన్ కు సంబంధించిన వివరాలు మరో రెండు రోజుల్లో తెలియజేస్తామని చెప్పారు. కాగా 'పుష్ప 2' సినిమాలో ఐటెం సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ని తీసుకున్నారు. Also Read : 'కంగువ' ప్రెస్ మీట్.. సూర్య స్టైలిష్ లుక్, దిశా పటాని హాట్ షో అయితే ఇటీవల ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులు చేసాడని జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసింది. దీంతో జానీ మాస్టర్ జైలుపాలయ్యారు. ఇదికాస్త ఇండస్ట్రీలో వివాదం అయింది. దాంతో 'పుష్ప' నిర్మాతలు జానీ మాస్టర్ ను తీసేసి వేరే కొరియోగ్రాఫర్ ను పెట్టుకున్నారు. షరతులతో కూడిన బెయిల్.. జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తనని లైంగికంగా వేధించారన్న మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రెండు వారాలుగా ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును నిలిపివేస్తున్నట్లు అవార్డుల కమిటీ ప్రకటించింది. ఈ అవార్డు ఫంక్షన్ కోసం జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కూడా పొందారు. తాజాగా మరోసారి తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. Also Read : అల్లు అర్జున్ కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. ఫ్యాన్స్ అంతా ఒక్కటే #jani-master #pushpa-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి