ఇట్స్ అఫీషియల్.. పుష్ప2 ఐటెం సాంగ్ లో శ్రీలీల.. పోస్టర్ బ్లాక్ బస్టర్ పుష్ప2 మూవీలో ఐటెం సాంగ్ కోసం మేకర్స్ శ్రీలీలను సెలెక్ట్ చేశారు. ఈ మూవీలో కిస్సిక్ అనే సాంగ్ లో ఆమె తన డ్యాన్స్ ఇరగదీసేస్తుందని తెలిపారు. అందుకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. By Seetha Ram 10 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2'. ఎంతో మంది కళ్లుకాయలు కాచేలా ఈ సినిమా కోసం చూస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే ఈ సినిమాలోని ఐటెం సాంగ్ లో ఏ హీరోయిన్ నటిస్తుంది అనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. దాదాపు ఈ సాంగ్ కోసం శ్రీలీలనే మేకర్స్ సెలెక్ట్ చేసినట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే గాసిప్ వార్తలే ఇప్పుడు నిజమయ్యాయి. Also Read: ట్రంప్ గెలుపు...అమెరికాకు గుడ్ బై చెబుతున్న హాలీవుడ్ హీరోయిన్లు ఐటెం సాంగ్ లో శ్రీలీల పుష్ప 2 సినిమాలోని ఐటెం సాంగ్ లో శ్రీలీల తన మాస్ స్టెప్పులతో దుమ్ముదులిపేస్తుందని మేకర్స్ ఓ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. 'ది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల'అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆమె 'కిస్సిక్' అనే సాంగ్ లో ఇరగదీసేస్తుందని తెలిపారు. కాగా ఆ పోస్టర్ లో శ్రీలీల లుక్ చూస్తుంటే మేకర్స్ చెప్పింది నిజమనే అనిపిస్తుంది. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. Also Read: రేవంత్ సర్కార్ కు షాక్.. కులగణనపై ప్రజల్లో వ్యతిరేకత! భారీ రెమ్యూనరేషన్ అయితే ఈ ఐటెం సాంగ్ కోసం శ్రీలీల భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి హీరోయిన్ గా దూసుకుపోయిన ఈ యంగ్ బ్యూటీ.. ఇప్పుడిప్పుడు ఐటెం సాంగ్ లపై ఆసక్తి చూపిస్తోంది. ఇందులో భాగంగానే పుష్ప 2లో ఐటెం సాంగ్ కు భారీగా పారితోషికం తీసుకుందని టాక్ వినిపిస్తోంది. దాదాపు రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే శ్రీలీల ఇంత మొత్తంలో తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్ ఇకపోతే సినిమా విషయానికొస్తే.. లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో రెండో పార్ట్ ను మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. Also Read: ట్రంప్ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు ఇందులో భాగంగానే ఈ సినిమా క్యారెక్టర్స్, విజువల్స్, సాంగ్స్, తదితర విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ ఏ రేంజ్ లో రెస్పాన్స్ అందుకున్నాయో అందరికీ తెలిసిందే. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) #rtv #rtv-live #tollywood #allu-arjun #pushpa-2 #srileela మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి