/rtv/media/media_files/2025/08/23/vinayaka-chavithi-2025-2025-08-23-19-42-11.jpg)
Vinayaka Chavithi 2025
తొలి పూజ వినాయక చవితికి హిందూ పండుగల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. వినాయకుడిని పూజించిన తర్వాతే వరుస పండుగలు వస్తాయి. అందుకే ఏ శుభకార్యం చేపట్టినా కూడా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. అయితే ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని పనులు సరిగ్గా జరగాలని గణపతిని పూజిస్తారు. అయితే ప్రతీ ఏడాది భాద్రపద శుక్లపక్ష చవితి తిథి నాడు వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. అయితే కొందరికి తెలియకుండా గణపతి పూజలు కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటివల్ల పూజ చేసిన పుణ్య ఫలితం రాకుండా పాపం చుట్టుకుంటుందని పండితులు అంటున్నారు. మరి ఈ చవితి నాడు అసలు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: Vinayaka chavithi 2025: వినాయక చవితి నాడు ఎవరు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదో మీకు తెలుసా?
భక్తులు ఎంతో భక్తితో గణపతిని పూజించాలి. ఎలాంటి పొరపాట్లు ఈ పూజలో నిర్వహించకూడదు. అయితే తెలుగు పంచాంగం ప్రకారం చవితి తిథి ఆగస్టు 26 అనగా మంగళవారం మధ్యాహ్నం 1:54 గంటలకు మొదలైంది. నేడు మధ్యాహ్నం 3:44 గంటల వరకు ఉంటుంది. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే పండుగ జరుపుకోవాలి. అయితే నేడు కూడా పూజ చేసుకోవడానికి సమయం ఉంటుంది. ఆ సమయంలో పూజలు చేస్తేనే మంచిదని పండితులు చెబుతున్నారు. ఉదయం 11:47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:41 వరకు మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో చవితి పూజలు చేస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవని పండితులు అంటున్నారు. ఈ ముహూర్తంలో బొజ్జ గణపతిని ప్రతిష్టించి పూజిస్తే అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు.
గణపతిని ఇలా పూజిస్తేనే..
ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని కొత్త దుస్తులు ధరించాలి. ఆ తర్వాత ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టి, ఇంట్లో సంబ్రాణి ధూపం వేయాలి. తూర్పు దిక్కున పసుపు రాసిన పీఠం పెట్టాలి. మట్టి గణపతిని ముందుగా తామరాకుపై ప్రతిష్టించుకోవాలి. ఆ తర్వాత పాలవెల్లికి పసుపు, కుంకుమ అన్ని పెట్టి అలకరించుకోవాలి. ఆ తర్వాత పాలవెల్లని అమర్చుకుని వెండి, రాగి, ఇత్తడి కలశాలతో గంగాజలం వేసిన కలశం ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత దీపారాధన చేయాలి. ఇంతలో పసుపు గణపతిని చేసుకుని బెల్లం, అరటి పండుతో పూజ చేసి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత తర్వాత పూవ్వులు, అక్షింతలు వేస్తూ అష్టోత్తర శతనామాలు, 21 రకాల పత్రితో శాస్త్రోక్తంగా పూజ చేయాలి. అలాగే 21 రకాల పిండి వంటలు పెట్టాలి. ముఖ్యంగా ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలు వంటివి నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత వినాయక చవితి కథను చదివి అక్షింతలు వేసుకోవాలి. ఉదయంతో పాటు సాయంత్రం కూడా వినాయక చవితి పూజ చేస్తేనే మీకు ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: Vinayaka Chavithi 2025: 500 ఏళ్ల తర్వాత ప్రత్యేకమైన వినాయక చవితి.. ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్ట యోగం!