Sravana Masam 2025: శ్రావణ శుక్రవారం నాడు ఈ దీపం వెలిగిస్తే.. ఇంట్లో పొంగి పొర్లనున్న ధనం

శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఉప్పు, గోధుమ పండి, పుసుపుతో తయారు చేసిన వాటితో లక్ష్మీదేవికి దీపం పెట్టడం వల్ల అదృష్టంతో పాటు అష్ట ఐశ్వర్యాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా నెయ్యితో దీపం వెలిగించాలని పండితులు అంటున్నారు.

New Update
Sravana Masam 2025

Sravana Masam 2025

హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం అతి పవిత్రమైనది. ఈ మాసంలో మహిళలు శివుడు, లక్ష్మీ దేవిని ఎంతో భక్తితో పూజిస్తారు. పూజలు, ఉపవాసం ఇలా అన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ముఖ్యంగా శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నాడు రెండో శ్రావణ శుక్రవారం. ఇంతటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు కొన్ని పదార్థాలతో దీపాలను వెలిగించడం వల్ల ఇంట్లో అదృష్టం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ దీపాలను వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి అంతా కూడా తొలగిపోతుంది. అన్ని విధాలుగా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. మరి శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో వెలిగించాల్సిన ఆ దీపాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: Sravana Masam 2025: ఈ నియమాలు శ్రావణ మాసంలో పాటిస్తే.. దరిద్రం పోయి.. సకల సంతోషాలు కలుగుతాయట!

ఉప్పు దీపం

ఉప్పును లక్ష్మీదేవితో కొలుస్తారు. శ్రావణ శుక్రవారం రోజునే కాకుండా ఎప్పుడూ కూడా ఉప్పుతో లక్ష్మీదేవికి దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. సూర్యోదయం కాకముందు లేదా సూర్యాస్తమయం తర్వాత అయినా ఈ దీపం పెట్టాలని చెబుతున్నారు.

ఐదు దీపాలు
పూజ గదిలో అమ్మవారి ఎదుట ఒక దీపం కాకుండా ఐదు దీపాలు నెయ్యితో పెట్టాలి. ఐదు దీపాలను పంచభూతాలకు ప్రతీకగా భావిస్తారు. దీనివల్ల ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు. సుఖశాంతులు, సంపద పెరుగుతాయని పండితులు అంటున్నారు. 

గోధుమ పిండి దీపం
గోధుమ పిండితో చేసిన దీపం శుక్రవారం నాడు పెట్టడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. గోధుమ పిండిలో నెయ్యి కలిపి దీపం షేప్‌లో కలుపుకుని చేయాలి. శుక్రవారం నాడు కేవలం నెయ్యితో మాత్రమే దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: Sravana Masam Reel Ideas: శ్రావణ మాసంలో ఈ రీల్స్ చేస్తే.. మిలియన్ల వ్యూస్ పక్కా!

పసుపు దీపం
పసుపు శుభానికి ప్రతీక. ఏ శుభకార్యం చేపట్టినా కూడా తప్పకుండా పసుపు ఉపయోగిస్తారు. ఈ శ్రావణ శుక్రవారం నాడు పసుపు ముద్దను తయారు చేసి.. దీంతో దీపం పెడితే ఇంట్లో అంతా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుందని పండితులు అంటున్నారు. 

దీపంతో పాటు ఈ పనులు
శ్రావణ శుక్రవారం నాడు దీపం వెలిగించడంతో పాటు కొన్ని నియమాలు పాటించాలి. పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత మంచి దుస్తులు ధరించి దీపం వెలిగించాలి. కేవలం ఆవు నెయ్యిని ఉపయోగించి దీపం పెట్టాలి. ఆవు నెయ్యి లేని వారు నువ్వుల నూనెతో అయినా దీపం వెలిగించవచ్చు. వీటితో పాటు పేదవారికి దుస్తులు సాయం చేయడం, అన్నదానం వంటివి చేయాలని పండితులు అంటున్నారు. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిని నైవేద్యంగా పెట్టాలి. పాయసం, తోటకూర వంటి పదార్థాలతో పాటు పండ్లు, స్వీట్లు వంటివి పెట్టడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

Advertisment
తాజా కథనాలు