Devi Navaratri 2025: నవరాత్రుల వేళ అదృష్టం వరించాలంటే.. ఈ వస్తువులు ఇంటికి తీసుకురావాల్సిందే!

నవరాత్రుల సమయంలో వెండి నాణెం, తులసి మొక్క, గంగాజలం, రాగిచెంబు వంటివి ఇంటికి తీసుకురావాలని పండితులు చెబుతున్నారు. వీటిని ఇంటికి తీసుకొస్తే అదృష్టం వర్తిస్తుందని పండితులు అంటున్నారు.

New Update
navaratri 2024

Devi Navaratri 2025

సనాతన ధర్మంలో నవరాత్రులు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ పండుగను ప్రతీ ఏడాది ఎంతో భక్తితో పూజిస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు కొన్ని వస్తువులను కొందరు ఇంటికి తీసుకొస్తుంటారు. వీటివల్ల ఇంటికి మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే నవరాత్రుల సమయంలో ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Navratri 2025: ఈసారి నవరాత్రి 9కి బదులుగా 10 రోజులు ఎందుకు వచ్చింది.. ప్రత్యేక కారణం ఏంటో తెలుసా..?

వెండి నాణెం

నవరాత్రి రోజుల్లో వెండి నాణెంను ఇంటికి తీసుకురావడం చాలా మంచిది. వెండిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. నవరాత్రి తొమ్మిది రోజులు ఈ నాణేన్ని పూజించడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని, సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. వెండి నాణెం తీసుకువచ్చి, దానిని పసుపు, కుంకుమతో పూజించి అక్కడ ఉంచడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

తులసి మొక్క
మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే నవరాత్రి సందర్భంగా దానిని తీసుకురావడం ఎంతో శుభకరం. తులసిని లక్ష్మీదేవికి మరో రూపంగా భావిస్తారు. నవరాత్రి సమయంలో తులసి మొక్కను పూజించడం వల్ల దేవి అనుగ్రహం లభిస్తుంది. తులసి మొక్కను ఇంటికి తెచ్చి ఈ తొమ్మిది రోజులు పూజించడం వల్ల ఇంట్లో సంతోషం, సంపద పెరుగుతాయి. తులసికి రోజూ నీరు పోసి, దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు.

సువాసన పూలు
నవరాత్రి పూజలో దుర్గాదేవికి సువాసన గల పూలను సమర్పించడం చాలా ముఖ్యం. సంపంగి, గులాబీ, మల్లె వంటి సుగంధ పూలను ఇంటికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది. పూల సువాసన ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

గంగాజలం
నవరాత్రి సమయంలో ఇంటిని శుభ్రం చేయడానికి గంగాజలాన్ని ఉపయోగించడం మంచిది. పూజకు ముందు ఇల్లు మొత్తం గంగాజలంతో శుద్ధి చేయడం వల్ల పవిత్రత పెరుగుతుంది. గంగాజలం పవిత్రతకు, శుద్ధతకు ప్రతీక. దీనిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయని విశ్వాసం.

రాగి చెంబు
నవరాత్రి పూజలో రాగి చెంబు ఉపయోగించడం వల్ల కూడా శుభం కలుగుతుంది. రాగిని అత్యంత పవిత్ర లోహంగా భావిస్తారు. కలశ స్థాపనలో రాగి చెంబును ఉపయోగించడం వల్ల దేవత సంతోషిస్తుంది. ఈ చెంబులో పసుపు, కుంకుమ, బియ్యం, నాణెం వేసి పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

నవరాత్రిలో పూజా విధానం
నవరాత్రిలో ప్రతిరోజూ దుర్గాదేవిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత పూజా గదిలో కలశ స్థాపన చేయాలి. ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. నవరాత్రుల్లో ఉపవాసం పాటించడం వల్ల దేవి ఆశీస్సులు లభిస్తాయి. నవరాత్రుల్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి వస్త్రాలను ఉపయోగించడం వల్ల కూడా శుభం కలుగుతుందని నమ్ముతారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి: Today Horoscope: ఈ రాశుల వారికి నేడు కష్టమే.. ఏ పని తలపెట్టినా జరగడం అసాధ్యం

Advertisment
తాజా కథనాలు