Kingdom 2: ‘కింగ్డమ్ 2’లో మరొక స్టార్ హీరో.. నిర్మాత నాగవంశీ అఫీషియల్ అప్డేట్
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సక్సెస్ మీట్లో నిర్మాత నాగవంశీ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ మూవీ సెకండ్ పార్ట్‌లో మరొక స్టార్ హీరో నటించబోతున్నాడని తెలిపారు. ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక.. ‘కింగ్డమ్2’ మొదలవుతుందని చెప్పుకొచ్చారు.