Kingdom 2: ‘కింగ్డమ్‌ 2’లో మరొక స్టార్ హీరో.. నిర్మాత నాగవంశీ అఫీషియల్ అప్డేట్

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సక్సెస్ మీట్‌లో నిర్మాత నాగవంశీ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ మూవీ సెకండ్ పార్ట్‌లో మరొక స్టార్ హీరో నటించబోతున్నాడని తెలిపారు. ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక.. ‘కింగ్డమ్2’ మొదలవుతుందని చెప్పుకొచ్చారు.

New Update
producer nagavamsi about vijay devarakonda kingdom 2 movie update

producer nagavamsi about vijay devarakonda kingdom 2 movie update

Kingdom 2: విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’(Kingdom Movie). గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. ఇందులో సత్యదేవ్(Satyadev) కీలక పాత్రలో పోషించారు. అలాగే రొనిట్ కామ్రా, వెంకటేష్ V.P. వంటి నటులు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 

Also Read: సంచలన నిర్ణయం.. 16 ఏళ్ల లోపు పిల్లలు యూట్యూబ్‌ వాడటంపై నిషేధం

Kingdom 2 Update

ఈ చిత్రాన్ని దాదాపు రూ.130 కోట్లతో నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం నిన్న అంటే జూలై 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ సినిమాకి ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ మూవీలో విజయ్ దేవరకొండ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయని చెబుతున్నారు. 

Also Read: వధువుకు షాక్ ఇచ్చిన వరుడు..పెళ్లిమండపంలో శృంగార వీడియో లీక్

విజయ్ తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ చిత్రానికి BGM చించేశాడని చెప్పుకొస్తున్నారు. సౌండ్, ఎమోషనల్ సీజన్స్ హైలైట్ అయ్యానని చెబుతున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ బాగుందని.. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కాస్త బోరింగ్‌గా అనిపించిందని కొందరు అంటున్నారు. 

మొత్తంగా విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో ఒక మంచి హిట్ వేసుకున్నాడనే చెప్పాలి. ఈ క్రమంలో ‘కింగ్డమ్ 2’ మూవీపై నిర్మాత నాగవంశీ(Producer Naga Vamsi) అదిరిపోయే అప్డేట్ అందించాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయిన వెంటనే ‘కింగ్డమ్’ సీక్వెల్ పట్టాలెక్కుతుందని తెలిపారు. ఈ మేరకు ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ పై మూవీ యూనిట్ హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. అందులో నిర్మాత నాగవంశీ ఈ వాఖ్యలు చేశారు. 

ఆయన మాట్లాడుతూ.. తాము ఊహించనట్లుగానే సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆస్వాదిస్తారని.. త్వరలోనే ఏపీలో కూడా సక్సెస్ మీట్ నిర్వహిస్తామని తెలిపారు. అదే సమయంలో ‘కింగ్డమ్ 2’ మూవీలో హీరోయిన్ పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ఈ సీక్వెల్‌లో మరొక అగ్రహీరో కూడా ఉంటారని ఆయన తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు