/rtv/media/media_files/2024/10/25/TSsQ3j7yh2sMONxcQt5k.jpg)
Allu Arjun-Trivikram Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో నాలుగో చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు మంచి కమర్షియల్ విజయాలు సాధించాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు బాక్సాఫీస్ హిట్లుగా నిలిస్తే.. 'అల వైకుంఠపురములో' సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది.
కాగా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ను ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రెజెంట్ 'పుష్ప 2' (Pushpa 2) షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్న బన్నీ.. ఇది పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత నాగవంశీ (Naga Vamsi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఇంతవరకూ ఎవరు టచ్ చేయని పాయింట్ తో ఉండబోతుందని ఒక్కసారిగా హైప్ పెంచేశాడు.
Also Read: ట్రెండింగ్‌లో ఉంచినందుకు మీ అందరికీ థ్యాంక్స్.. జానీ మాస్టర్ షాకింగ్ పోస్ట్
what im really curious to see is how trivikram is gonna handle huge canvas involving vfx and my only usp of this film is allu arjun as he is the only actor i believe has the proper potential to squeeze the best out of a director as generally it’s the other way round https://t.co/PXBOzJ8Qvi
— Srikar (@hastalavistha) October 24, 2024
Also Read : వామ్మో.. 'పుష్ప 2' ను అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారా?
మార్చి నుంచి షూటింగ్..
" అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సినిమా స్క్రిప్ట్ పనులు చివరిదశలో ఉన్నాయి. ‘పుష్ప 2’ పూర్తయ్యాక దీని వివరాలు వెల్లడిస్తాం. జనవరిలో స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటిస్తాం. మార్చి నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం. మార్చిలోనే అల్లు అర్జున్ చిత్రీకరణలో పాల్గొంటారు. ఇప్పటివరకు రాజమౌళి ఎన్నో గొప్ప సినిమాలు చేశారు.
ఆయన కూడా టచ్ చేయని జానర్‌లో ఈ సినిమా ఉంటుంది. మంచి విజువల్స్ ఉంటాయి. ఇప్పటివరకు దేశంలో ఎవరూ చూడని కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని రూపొందిస్తున్నాం.." అని చెప్పుకొచ్చారు. దీంతో నాగవంశీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read: దానా తుపాను.. గర్భిణుల అవస్థలు..ఒకే సారి 1600 మంది ప్రసవం
Also Read : జానీ మాస్టర్ కు బెయిలొచ్చింది, 'పుష్ప2' షూట్ లో జాయిన్ అవుతారా?