/rtv/media/media_files/2025/01/31/EWiGvkjZ0tTKuLXsJH3a.jpg)
Vijay Deverakonda, Gautham Tinnanuri, Naga Vamsi combo VD 12 movie title fixed
‘లైగర్’ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. ‘VD12’ వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి సినీ ప్రేక్షకులు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇప్పుడంతా ఈ సినిమాపైనే అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఎవ్వరి అంచనాలకు అందకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలో ఈ సినిమా గురించి మాట్లాడిన నిర్మాత నాగవంశీ ఫుల్ హైప్ పెంచేశాడు.
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
‘విడి12’ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పడంతో మరింత బజ్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి గతంలో ఒక పోస్టర్ రిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది. అందులో విజయ్ దేవరకొండ రగ్గడ్ లుక్‌లో చిన్న హెయిర్‌కట్‌తో కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది.
#SAMRAJYAM title under Consideration for VD 12#VD12 #VijayDeverakonda #Tollywood #State360Telugu pic.twitter.com/XYmSUO1Wiv
— State 360 Telugu (@State360Telugu) January 31, 2025
Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!
అదిరిపోయే టైటిల్
తాజాగా ఈ మూవీ టైటిల్ గురించి నిర్మాత నాగవంశీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ‘నేను గౌతమ్‌ని చాలా హింస పెట్టాక, ఫైనల్‌గా వీడీ 12 టైటిల్ లాక్ చేశాం.. త్వరలోనే టైటిల్ రివీల్ చేస్తాం’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ టైటిల్ ఏంటా? అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదే ఆ టైటిల్ అంటూ మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ‘సామ్రాజ్యం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది. మూవీ యూనిట్ ఏ టైటిల్ ఫిక్స్ చేసిందో మరికొద్ది రోజుల్లో తేలనుంది.