/rtv/media/media_files/2025/09/06/two-remand-prisoners-escape-2025-09-06-07-48-31.jpg)
Two remand prisoners escape
Prisoners Escape: ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు ఉడాయించారు. శుక్రవారం సాయంత్రం రిమాండ్ ఖైదీలిద్దరూ జైలు వార్డర్‌పై సుత్తితో దాడిచేసి పరారీ కావడం కలకలం రేపింది. పరారైన ఖైదీల్లో ఒకరు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ కార్యదర్శి నక్కా రవికుమార్‌కాగా, మరోకరు మాడుగులకు చెందిన బెజవాడ రాముగా గుర్తించారు.నక్కా రవికుమార్ ప్రభుత్వ సామాజిక పింఛన్ల సొమ్మును మాయం చేసిన కేసులో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను ఏప్రిల్ 25న అనంతగిరి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఇక బెజవాడ రాము పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రెండు నెలల క్రితం మాడుగుల మండలంలో బంగారం దొంగతనం కేసులో రామును జూలై 23న మాడుగుల పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో ఖైదీగా ఉన్నాడు.
పోలీసులపై సుత్తితో దాడి చేసి పరారైన రిమాండ్ ఖైదీలు
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2025
అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలులో ఘటన
గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులు pic.twitter.com/cXZ9DZUUw8
ఇది కూడా చూడండి:History of Balapur Laddu: బాలాపూర్ లడ్డూ ప్రత్యేకతలివే...
శుక్రవారం సాయంత్రం వంట పనుల్లో సాయం చేసేందుకు నిందితులిద్దరినీ సెల్ నుంచి బయటకు వదిలారు. వంట పనిలో సాయం చేస్తున్నట్టుగా నటించిన రవికుమార్.. అక్కడ ఉన్న సుత్తి తీసుకుని గదిలో విధి నిర్వహణలో ఉన్న జైలు వార్డర్ బి.వీర్రాజుపై సుత్తితో దాడి చేశాడు. దాడిలో వీర్రాజు పడిపోవడంతో అతని వద్ద ఉన్న తాళాలు లాక్కుని ఇద్దరూ జైలు గేటు తెరచుకుని పారిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సబ్ జైలుకు చేరుకుని వివరాలు సేకరించారు. బృందాలుగా ఏర్పడి పరారైన ఖైదీల కోసం గాలింపు చేపట్టారు. కాగా నిందితుల దాడిలో గాయపడ్డ వార్డర్ వీర్రాజును చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా శుక్రవారం రాత్రి సబ్ జైలును సందర్శించి సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
ఇది కూడా చూడండి:Balapur Ganesh Laddu: కోటి ఖర్చైనా పర్లేదు..బాలాపూర్ లడ్డూకు ఈ సారి భారీ పోటీ!