Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. తవ్వుతున్న కొద్దీ ఇందులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డిపై గత ప్రభుత్వంలో 24/7 నిఘా పెట్టిందని విచారణలో తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. తవ్వుతున్న కొద్దీ ఇందులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డిపై గత ప్రభుత్వంలో 24/7 నిఘా పెట్టిందని విచారణలో తెలిసింది.
ఎన్నికల వేళ ఏపీలోనిపెద్దాపురంలో పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమ బంగారం లభ్యమైంది. దాని విలువ సుమారు రూ.5 కోట్ల 60 లక్షల విలువ ఉంటుందని తెలుస్తోంది. 8 కిలోల 116 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 46 కేజీల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో సుమారు 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తలపై రూ.కోటి రివార్డ్ ఉన్న మావోయిస్ట్ మిసిర్ బెస్రా బృందానికి చెందినవారు లొంగిపోయినట్లు పోలీస్ అధికారి పేర్కొన్నారు.
గత ఏడాది అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా దాదాపు రూ.1,143 కోట్లు.. సైబర్ నేరగాళ్ల చేతిలోనే పోయాయని ఓ నివేదికలో వెల్లడైంది. తెలంగాణ నుంచి పలువురు ఆన్లైన్ మోసాల బారినపడి 2023 అక్టోబర్‌లో ఏకంగా రూ.26 లక్షల పోగొట్టుకున్నారని పేర్కొంది.
పోలీసులు యునిఫాం బయట కనిపించే టాటూలను15 రోజుల్లోగా తొలగించాలని ఒడిశాలోని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించడంలో విఫలమైతే.. వాళ్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
రెండు రోజులుగా దండకారణ్యం దద్ధరిల్లుతోంది. కాల్పుల మోతతో హోరెత్తుతోంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు మృత్యువాతను పడుతున్నారు. ఇప్పటిదాకా 13 మంది చనిపోయారని తెలుస్తోంది.
రైతు బాసటగా కేసీఆర్ మరో ఉద్యమానికి బయలుదేరారు. ఇందులో భాగంగా జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనకు బయలు దేరిన కేసీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మొండ్రాయి చెక్ పోస్ట్ దగ్గర ఆయన వెళుతున్న బస్సును ఆపి తనిఖీలు నిర్వహించారు.
పోలీసులపై గిరిజనులు దాడి చేశారు. సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రెండు వర్గాల మధ్య నెలకొన్న పోడు భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన పోలీసులను గిరిజనులు తీవ్రంగా కొట్టారు.
ఛత్తీస్గడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు కీలకనేతలు నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.