Vishwak Sen : నటుడు విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ...ఏం ఎత్తుకెళ్లారంటే
హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ లోని తమ ఇంట్లో చోరీ జరిగినట్టు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బెడ్ రూమ్ లో బంగారు ఆభరణాలు కనిపించకపోవటంతో దొంగతనం జరిగినట్టు గుర్తించారు.
Pochampally Srinivas Reddy : పోలీస్ స్టేషన్ కు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి..నాలుగున్నర గంటలపాటు...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. పోలీసులు ఎమ్మెల్సీ పోచంపల్లిని నాలుగున్నర గంటలపాటు విచారించారు. ఫిబ్రవరి 11వ తేదీన తోల్ కట్ట గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.
షాద్‌నగర్‌లో దారుణం.. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే గొంతు కోశాడు!
షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. పోలీస్ స్టేషన్లో ప్రేమజంటపై హత్యాయత్నం చేశాడో దుండగుడు. పోలీసులు చూస్తుండగానే బ్లేడుతో గొంతు కోశాడు. పోలీస్ స్టేషన్లోనే తమకు రక్షణ లేకపోతే ఇక బయట తమ పరిస్థితి ఎలా ఉంటుందంటూ ప్రేమికులు వాపోతున్నారు.
HYD: హైడ్రా మొదటి పోలీస్ స్టేషన్ ఏర్పాటు
హైదరాబాద్‌లో హైడ్రా మొదటి పోలీస్ స్టేషన్ ఏర్పాటయింది. బుద్ధభవన్‌లో ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సర్కార్ తెలిపింది. దీనికి సంబంధించి చట్టబద్ధత కల్పిస్తూ ఇప్పటికే చట్టంలో కూడా సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
Telangana: తెలంగాణలో స్పెషల్ పోలీస్ స్టేషన్లు.. ఇకపై వారికి చుక్కలే!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయి, డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రత్యేక నార్కొటిక్స్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్ పీఎస్‌ల తరహాలోనే కేసులు దర్యాప్తు చేస్తారు.
AP: ఏఎస్ఐ నా పీక కోశాడు.. బ్లేడు గాట్లతో యువకుడి హల్ చల్!
ఏపీ ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో సురేష్ అనే యువకుడు వీరంగం సృష్టించాడు. తండ్రిని చంపిన నిందితుల వద్ద పోలీసులు లంచాలు తీసుకుని తమకు అన్యాయం చేశారంటూ బ్లేడుతో కోసుకుని హల్ చల్ చేశాడు. ఏఎస్ఐ తన పీక సగం కోశాడని ఆరోపిస్తున్నాడు.