జై భీమ్ సీన్ రిపీట్.. త్రీ టౌన్ పోలీసుల ఓవర్‌యాక్షన్
కర్నూల్ లో జై భీం మూవీ సీన్ రిపీట్ అయ్యింది. కర్నూల్ త్రీ టౌన్ పోలీసులు ఇద్దరు అనుమానితులను 14 రోజులుగా బంధించి చేయని తప్పును ఒప్పుకోమని చిత్రహింసలు పెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితుల తల్లిదండ్రులు లాయర్‌ను ఆశ్రయించడంతో విషయం బయట పడింది.
Video Viral: కేసు తీసుకోలేదని మహిళ పోలీస్‌స్టేషన్‌లో చేసిన పని చూడండి
మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఒక పోలీసు అధికారికి మహిళ హారతి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 26 రోజులుగా విచారణ జరుగుతున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదనే కోపంతో అధికారికి బుద్ధిరావాలని ఇలా చేశానని మహిళ చెబుతోంది. ఆ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Andhra Pradesh: జగత్జంత్రీలు.. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే చోరీ చేశారు..!
దొంగలను పోలీసులు అరెస్ట్ చేస్తుంటే.. ఈ కేటుగా మాత్రం పోలీస్ స్టేషన్లోనే దొంగతనం చేశారు. ఎలమంచిలి పీఎస్ నుంచి 2 బస్తాల గంజాయిని ఎత్తుకేళ్లారు. ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తప్పవన్నారు అనకాపల్లి జిల్లా ఎస్పీ.
పోలీస్ స్టేషన్ పై ఆత్మాహుతి దాడి.. 24 మంది మృతి
పాకిస్థాన్ ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మొత్తం 24 మంది మరణించగా 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ అధికారులే లక్ష్యంగా దాడికి పాల్పడ్డట్లు ఉగ్రవాద సంస్థ 'టీజేపీ' ప్రకటించింది.
పోలీసులు బూతులు తిట్టారని స్టేషన్ లోనే యువకుడి దారుణం.. ఏం చేశాడంటే
ఏ తప్పు చేయకుండానే పోలీసులు అదుపులోకి తీసుకుని అన్యాయంగా కొట్టారంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా యర్రగొంపాలెంలో చోటుచేసుకుంది. అదే పోలీస్టేషన్ లో మోజేష్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Vizag: పోలీసు స్టేషన్ కి తాళం వేసిన మహిళ..సమస్య పరిష్కరించడం లేదని వినూత్న నిరసన!
తన సమస్యను పరిష్కారించాలంటూ ఐదు రోజులుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతుంది ఆ మహిళ. కానీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో సహనం చచ్చిపోయిన ఆమె ఏకంగా పోలీసు స్టేషన్ కే తాళం వేసి నిరసన తెలిపింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది.
Anjireddy case: అంజిరెడ్డి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్... అందుకే చంపేశారా..?
సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాత, స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అంజిరెడ్డిని రవి అనే వ్యక్తి ఆస్తి దక్కించుకోవడం కోసం చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన గత నెల 29న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిదింతుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Loan App: అప్పు తీసుకున్న పాపానికి అశ్లీల ఫొటోలతో.. ఈ లోన్ యాప్ ఏం చేసిందంటే?
లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలైయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని బోరబండలో చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులు తాళలేక విషం తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ వేధింపులతో తమ కొడుకు బలవన్మరణానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
/rtv/media/media_files/drYlhoC0rBGUaTtQ3UIq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/woman-complaining-to-SI-in-a-police-station-has-gone-viral-A-video-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Yelamanchili-Police-Station-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/33-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-07T085016.108-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/women-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Murder-case-of-producer-and-real-estate-trader-Anjireddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Another-youth-committed-suicide-due-to-loan-app-harassment-jpg.webp)