/rtv/media/media_files/2026/02/16/pm-modi-2026-02-16-21-46-12.jpg)
PM Modi
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ''ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్''ను ప్రధాని మోదీ ప్రారంభించారు. నేటి నుంచి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, UAE, బ్రెజిల్, అమెరికా తదిత దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. మొత్తంగా 45కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సదస్సు వేదికగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘా, అధునిక రక్షణ వ్యవస్థలను అమర్చారు.
A Historic Moment in the Field of Technology! Prime Minister @narendramodi inaugurated the India AI Impact Expo 2026, giving a new direction to India's digital revolution. #IndiaAIImpactSummit2026pic.twitter.com/IngB9gQSu4
— Ministry of Electronics & IT (@GoI_MeitY) February 16, 2026
వైమానిక దాడులు అడ్డుకునేందుకు భారత్ మండపంలో 5 యాంటీ డ్రోన్ సిస్టమ్‌లు, నాలుగు ఎయిర్ డిఫెన్స్ గన్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఉగ్రదాడి ఘటనలను తిప్పికొట్టేందుకు నేషనల్ సెక్యూరిటీ గార్డు (NSG) తో పాటు పలు భద్రతా సంస్థలను బరిలోకి దింపారు. మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక ప్రధాని మోదీ, ఇంటర్నేషనల్ వీవీఐపీల భద్రతాను NSGకి అప్పగించారు. మొత్తంగా ఢిల్లీ వీధుల్లో 10 వేల మందికి పైగా పోలీసులు మోహరించారు.
Also Read: టూరిస్ట్ యువతిపై గ్యాంగ్ రేప్.. ముగ్గురికి మరణశిక్ష
ఇక సదస్సు జరుగుతున్న ప్రాంతాన్ని 10 జోన్లు, 22 సెక్టార్లుగా డివైడ్ చేశారు. కమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్ సిస్టమ్, కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఏఐ కెమెరాలతో రద్దీ, అనుమానస్పద కదలికలను నిరంతంరం చూస్తున్నారు. క్యూఆర్ కోడ్, డిజిటల్ పాస్ ఉంటేనే అతిథులను సమ్మిట్ లోపలికి పంపిస్తున్నారు. మరోవైపు విదేశీ అతిథుల కోసం కేంద్రప్రభుత్వం బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు ఏర్పాటు చేసింది. వాళ్లు ఉండే హోటళ్లలో కూడా భద్రతను భారీగా పెంచింది.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi to inaugurate the India AI Impact Expo 2026, at Bharat Mandapam.
— ANI (@ANI) February 16, 2026
The India AI Impact Expo 2026 is being held from 16th to 20th February 2026, alongside the India AI Impact Summit. The theme of the Summit is Sarvajana Hitaya, Sarvajana… pic.twitter.com/QElKXW1KCr
అమెజనా, గూగల్, మైక్రోసాఫ్ట్ లాంటి గ్లోబల్ దిగ్గజాలు భారత్‌లో 68 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమ్మిట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ రానున్నారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
Follow Us