/rtv/media/media_files/2026/02/07/pm-modi-heads-to-malaysia-2026-02-07-12-04-39.jpg)
PM Modi Heads To Malaysia
ప్రధాని మోదీ మలేషియాకు బయలుదేరారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో అక్కడ ఆయన పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడనున్నాయి. వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రతా సహకారం, సెమీకండక్టర్ రంగంలో భారత్-మలేషియా భాగస్వామ్యాన్ని పెంపొందించేలా సంతకాలు జరగనున్నాయని తెలుస్తోంది. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అక్కడికి వెళ్తున్న సంగతి తెలిసిందే.
భారత్ నిర్మిత 'డోర్నియర్' విమానాల విక్రయం, మలేషియా వద్ద ఉన్న సుఖోయ్-30 యుద్ధ విమానాలు, స్కార్పెన్ సబ్‌మెరైన్ల నిర్వహణపై కీలక ఒప్పందాలు జరిగే ఛాన్స్ ఉంది. సెమీకండక్టర్ల తయారీలో పరస్పర సహకారం కోసం ఇరు దేశాల మధ్య ప్రత్యేక ఒప్పందం (MoU) కుదరనున్నట్లు తెలుస్తోంది. అలాగే భారత యూపీఐ సేవలను మలేషియాలో మరింత విస్తరించడంపై చర్చలు జరుగుతున్నాయి.
Also Read: భారత్ - అమెరికా కీలక ప్రకటన.. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు
వాణిజ్యం, పెట్టుబడులతో పాటు మరికొన్ని రంగాల్లో సహకారం కోసం ఇరు దేశాలు రెడీ అయ్యాయి. అవినీతిని అరికట్టడంలో, విపత్తుల సమయంలో సహాయక చర్యల కోసం పరస్పర అవగాహన ఒప్పందం జరగనుంది. అంతేకాదు మలేషియాలో భారతీయ అధ్యయనాల కోసం 'తిరువళ్లువర్ సెంటర్' ఏర్పాటుపై అలాగే విద్యా ఉపకార వేతనాల పెంపుపై ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా మలేషియాలో దాదాపు 29 లక్షల మంది భారత సంతతి ప్రజలు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రవాస భారతీయ సమూహం. ఈ పర్యటనలో భాగంగానే ప్రధాని మోదీ దాదాపు 15 వేల మంది భారత సంతతి వ్యక్తులతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ప్రధాని మోదీకి మలేషియాలో మూడోసారి పర్యటిస్తున్నారు. ఇక మార్చిలో ఆయన జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.
Also Read: దేశవ్యాప్తంగా ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల స్ట్రైక్.. డిమాండ్స్ ఇవే !
Follow Us