/rtv/media/media_files/2026/01/20/india-2026-01-20-08-54-14.jpg)
India, UAE deepen ties with mega defence plan
ప్రధాని మోదీతో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేల్ అల్ నహ్యాన్ సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. మోదీ ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి మరీ ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాధినేతల మధ్య కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేయాలని భారత్, యూఏఈ నిర్ణయం తీసుకున్నాయి. 2032 నాటికి ఇరు దేశాల మధ్య పరస్పర వార్షిక వాణిజ్యాన్ని 200 బిలియన్ డాలర్లకు (రూ.18 లక్షల కోట్లు) పెంచుకోవాలని తీర్మానం చేసుకున్నాయి.
అలాగే ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ బంధం దిశగా కీలక అడుగులు పడ్డాయి. అంతరిక్ష మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒప్పందం చేసుకున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలపై లెటర్స్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేశారు. ఇక దీర్ఘకాలిక ప్రాతిపదికన UAE ప్రతి సంవత్సరం భారత్‌కు 5 లక్షల టన్నుల LNG సరఫరా చేసే ఒప్పందం కుదిరింది. గుజరాత్‌లోని ధొలెరాలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌లో యూఏఈ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మరోవైపు సీమాంతర ఉగ్రవాదాన్ని ఇరుదేశాధినేతలు ఖండించారు. వీటికి ప్రోత్సాహం, ఆర్థిక సాయం చేస్తున్న వాళ్లని కఠినంగా శిక్షించాలంటూ పేర్కొన్నారు.
Also read: కుల్దీప్ సెంగర్‌కు బిగ్ షాక్.. శిక్ష రద్దు పిటిషన్‌ను కొట్టివేసి కోర్టు
ఆహార భద్రతతో పాటు వ్యవసాయ రంగంలోని పరస్పర సహకారం తదితర అంశాలపై ఒప్పందాలు జరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పరస్పరం సహకరించుకునేందుకు ఇరుదేశాలు ఒప్పుకున్నాయి. మరోవైపు పశ్చిమాసియాలోని రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్త పరస్థితులపై మోదీ, నహ్యాన్ ప్రధానంగా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే తమ చర్చలు ఫలప్రదంగా సాగాయని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. న్యహ్యాన్‌ను తన సన్నిహిత మిత్రుడిగా అభివర్ణించారు.
తమ చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగినట్టు మోదీ పేర్కొన్నారు. నహ్యాన్‌ను తన సన్నిహిత మిత్రునిగా సంబోధించారు. ‘‘విమానాశ్రయానికి వెళ్లి నా సోదరునికి స్వాగతం పలికా. భారత్, యూఏఈ మధ్య బలమైన మిత్ర బంధానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ పర్యటన అద్దం పడుతోంది’’అంటూ ఎక్స్ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. ఇరుదేశాల నడుమ ఇప్పటికే కీలకమైన ఒప్పందాలెన్నో కుదిరాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, స్థానిక కరెన్సీలోనే చెల్లింపుల వ్యవస్థ, ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం వంటివి వాటిలో ఉన్నాయి.
Also Read: ట్రంప్ ఒత్తిడి.. చాబహర్ పోర్టు నుంచి తప్పుకోనున్న భారత్ !
యెమన్‌లోని ముకల్లా పోర్టును యూఏఈ మద్దతున్న స్థానిక సాయుధ దళాలు అదుపులోకి తీసుకోవడంతో సౌదీ అరేబియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పోర్టుపై క్షిపణి దాడులకు దిగింది. దీంతో యెమన్ నుంచి UAE తమ బలగాలను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే నహ్యాన్ భారత్ పర్యటనకు వచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో చూసుకుంటే భారత్‌కు UAE సన్నిహిత దేశంగా ఉంది. కరోనా సమయంలో కూడా భారత్.. ఆ దేశానికి అత్యవసర వ్యాక్సీ్న్లు, తదితర సామాగ్రీని సరఫరా చేసింది. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడింది.
Follow Us