PM Modi : వచ్చే నెలలో రష్యాకు మోదీ?
ప్రధాని మోదీ జూలైలో రష్యాకు వెళ్లనున్నట్లు సమాచారం. మోదీ పర్యటన ఖాయమని, ఆయన రాకకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూర్తి ఉషకోవ్ చెప్పారు. మోదీ 2019లో చివరిసారిగా రష్యాకు వెళ్లారు.
ప్రధాని మోదీ జూలైలో రష్యాకు వెళ్లనున్నట్లు సమాచారం. మోదీ పర్యటన ఖాయమని, ఆయన రాకకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూర్తి ఉషకోవ్ చెప్పారు. మోదీ 2019లో చివరిసారిగా రష్యాకు వెళ్లారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య జల ఒప్పందానికి తాము ఏ మాత్రం ఒప్పుకోమని చెబుతున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దదీని గురించి చర్చల జరిగిన నేపథ్యంలో ప్రధాని మోదీకి ఆమె లేఖ రాశారు. రాష్ట్రం అభిప్రాయం తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మమతా మండిపడ్డారు.
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తొలి 15 రోజుల్లోనే పరీక్ష పేపర్ల వివాదాలు, రైల్వే ప్రమాదాలు ఉగ్రవాద దాడులు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ.. ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలోనే నిమగ్నమయ్యారని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలిరోజు 280 మంది లోక్ సభ ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ మోహతాజ్. రెండవ రోజు మిగిలిన 264 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు.
యోగా..భారతీయుల జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. శరీర సౌష్టవంతో పాటూ ఆోగ్యాన్ని కూడా ఇచ్చే యోగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ప్రతీ ఒక్కరు దీన్ని జీవనశైలిలో భాగం చేసుకుంటున్నారు.యోగాకి ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే దీనికి ప్రత్యేకంగా ఓ రోజుని అంకితం చేశారు.
నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు బయటపడటం విద్యార్థులు భవిష్త్యత్తు ఏంటీ అనేది ప్రశ్నార్థకంగా మారింది . ఓవైపు నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై స్పందించాలని పలువురు నిపుణలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా వైఫల్యం కనబడింది. రెండు రోజుల క్రితం వారణాసిలో పర్యటనకు వెళ్ళిన మోదీ కాన్వాయ్ మీద చెప్పులు విసిరారు. ఎవరు విసిరారు, ఎందుకు విసిరారు అన్న విషయాలే బయటకు రాలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కేంద్ర కేబినేట్ సమావేశంలో14 పంటలకు కనీస మద్ధతు ధరను పెంచాలని నిర్ణయించారు. ధాన్యం, రాగి, జవార్, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు మద్ధతు ధర పెరగనుంది. వరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2300 వరకు పెంచేందుకు ఆమోదం తెలిపారు.