గత ఏడాది మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ప్రధాని మోదీ.. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రాజ్‌కోట్ ఫోర్ట్‌లో ఉన్న ఈ 35 అడుగులు విగ్రహం.. సోమవారం మధ్యాహ్నం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. అయితే గత రెండు మూడురోజులుగా ఆ జిల్లాలో ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. విగ్రహం కూలడానికి ఇవే కారణం కావొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. విగ్రహం కూలిన అనంతరం సమాచారం మేరకు జిల్లా యంత్రాంగం ఘటనాస్థలానికి చేరుకుంది.
పూర్తిగా చదవండి..Shivaji statue: నేలకూలిన శివాజీ మహారాజ్ విగ్రహం.. కారణం ఏంటంటే ?
గత ఏడాది మహారాష్ట్రలో ప్రధాని మోదీ ఆవిష్కరించిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం సోమవారం మధ్యాహ్నం కుప్పకూలింది. గత రెండు మూడురోజులుగా అక్కడ కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలులే ఇందుకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.
Translate this News: