ఇటీవల మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో విపక్షాలు బీజేపీ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేశాయి. నాసీరకపు పనులు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. విగ్రహం కూలిపోవడంపై ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ” ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి నా క్షమాపణలు చెబుతున్నాను. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వారందరికి తలవంచి క్షమాపణలు తెలియజేస్తున్నాను. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏదీ లేదని” ప్రధాని మోదీ అన్నారు.
పూర్తిగా చదవండి..PM Modi: ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
ఇటీవల మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారందరికీ తలవంచి నా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏదీ లేదని వ్యాఖ్యానించారు.
Translate this News: