PM Modi Ukrain Visit: రష్యా–ఉక్రెయిన్ల మధ్య తాముఎప్పుడూ తటస్థమే అన్నారు భారత ప్రధాని మోదీ. తాము ఎవ్వరికీ సపోర్ట్ చేయడం లేదని..భారత దేశం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని చెప్పారు. రెండు దేశాల మధ్యా శాంతి నెలకొనాలన్నదే భారత్ ఆశయం అని చెప్పారు. ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే రష్యా–ఉక్రెయిన్‌లు సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇరు దేశాలు దీనికి పంబంధించి సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. ఇందుకోసం అన్నివిధాలా సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. యుద్ధం ఎప్పుడ సమస్యకు పరికారం కాదని పునరుద్ఘాటించారు.
పూర్తిగా చదవండి..PM Modi: భారత్‌ది ఎప్పుడూ శాంతి మార్గమే–ప్రధాని మోదీ
ఈరోజు ఉక్రెయిన్ పర్యటలో భాగంగా భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరివైపూ లేమని..రష్యా–ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న వివాదాన్ని దౌత్య మార్గం ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని మోదీ అన్నారు.
Translate this News: