PM Modi : కొండచరియలు విరిగిపడిన ఘటనపై మోదీ పోస్ట్
వయనాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసి ఆందోళనకు గురైనట్లు మోదీ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనపై కేరళ సీఎంతో మాట్లాడినట్లు చెప్పారు.