ప్రధాని మోదీకి దొంగలు షాక్ ! ప్రధాని మోదీకి దొంగలు షాక్ ఇచ్చారు. ఆయన బాంగ్లాదేశ్ పర్యటనలో సత్‌ఖిరాలోని జెషోరేశ్వరి ఆలయానికి మార్చి 2021లో బహుమతిగా ఇచ్చిన కాళీ దేవి కిరీటాన్ని దొంగలు కొట్టేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసుకు.. దొంగల కోసం వెతుకుతున్నారు. By V.J Reddy 11 Oct 2024 in నేషనల్ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి PM Modi: బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. సత్‌ఖిరాలోని జెషోరేశ్వరి ఆలయానికి మార్చి 2021లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కానుకగా ఇచ్చిన కాళీ దేవి కిరీటం చోరీకి గురైంది. గురువారం మధ్యాహ్నం ఆలయ పూజారి పూజలు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తున్న సమయంలో కిరీటం తప్పిపోయినట్లుగా గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయాన్ని తరతరాలుగా చూసుకుంటున్న కుటుంబానికి చెందిన జ్యోతి ఛటోపాధ్యాయ మాట్లాడుతూ.. ఈ కిరీటాన్ని వెండితో తయారు చేశారని, బంగారు పూత పూసినట్లు ఆమె వివరించారు. ఈ కిరీటం సాంస్కృతికంగా, మతపరంగా ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు. మోదీ ఇచ్చిన బహుమతి... కాగా 2021లో తన పర్యటనలో ప్రధాని మోదీ ఈ కిరీటాన్ని ఆలయానికి బహుమతిగా బహూకరించారు. బహుళ ప్రయోజనాల కోసం ఆలయం వద్ద భారత్ ఒక కమ్యూనిటీ హాల్‌ను నిర్మిస్తుందని ప్రధాని మోదీ తన పర్యటనలో హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలకు సామాజిక, మతపరమైన, విద్యా కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తుపానుల వంటి విపత్తుల సమయాల్లో కూడా అందరికీ ఆశ్రయం కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా హిందూ పురాణాల ప్రకారం.. భారతదేశంతో పాటు పొరుగు దేశాలలో విస్తరించి ఉన్న 51 శక్తి పీఠాలలో జెషోరేశ్వరి ఆలయం ఒకటిగా ఉంది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దం చివరి భాగంలో అనారి అనే బ్రాహ్మణుడు నిర్మించాడని విశ్వసిస్తున్నారు. ఏకంగా 100 తలుపులతో ఆలయాన్ని నిర్మించడం విశేషం. అనంతర కాలంలో 13వ శతాబ్దంలో లక్ష్మణ్ సేన్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో రాజా ప్రతాపాదిత్య ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. Also Read : RTV Exclusive: అమెరికాలో అంబరాన్నింటిన బతుకమ్మ సంబరాలు-VIDEO #pm-modi #bangladesh #thieves మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి