PM Modi: ప్రధాని మోదీ రికార్డ్.. ఎక్స్‌లో 100 మిలియన్లు దాటిన ఫాలోవర్లు
ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య 100 మిలియన్లు దాటింది. దీనిపై ప్రధాని స్పందించారు. ఎక్స్‌లో ఉండటం, సోషల్ మీడియా వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు తదితర వాటికి ఆదరణ వస్తుండటం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు.