ఒమర్ అబ్దుల్లాతో కలిసి పనిచేస్తాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కశ్మీరి ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వానికి సహాకారం అందిస్తుందన్నారు.

New Update
modi and abdullah

జమ్మూకశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా బుధవారం నేషనల్ కాన్ఫరెన్స్(NC) నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కశ్మీరి ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి కోసం.. కేంద్ర ప్రభుత్వం ఒమర్ అబ్దుల్లా, ఆయన బృందంతో కలిసి పనిచేస్తుందని, సహాకారం అందిస్తుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Also Read: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!

మెజార్టీ మార్క దాటిన ఎన్సీ

 బుధవారం ఒమర్ అబ్దుల్లాతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నౌషెరాకు చెందిన సురేందర్ చౌదరినీ ఒమర్ అబ్దుల్లా డిప్యూటీ సీఎంగా అవకాశమిచ్చారు. ఇక 6 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఎవరూ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. మరోవైపు ఇప్పటికే 42 రెండు స్థానాల్లో గెలిచిన ఎన్సీ పార్టీకి ఆరుగురు స్వతంత్ర్య అభ్యర్థులు మద్దతు తెలపడంతో ఆ పార్టీ బలం 48కి చేరింది. దీంతో కాంగ్రెస్ అవసరం లేకుండానే ఎన్సీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగే మెజార్టీ మార్క్‌ను దాటింది. దీంతో కాంగ్రెస్, ఎన్సీ మధ్య మంత్రి పదవుల మధ్య ఏమైనా విభేదాలు వచ్చి ఉండొచ్చనే ప్రచారాలు జరుగుతున్నాయి. 

Also Read: కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!

రెండోసారి సీఎంగా ఒమర్ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్‌లో మెజార్టీ సాధించిన ఎన్సీ పార్టీ.. కేంద్ర ప్రభుత్వంతో సానుకూల సంబంధాలను ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే కశ్మీర్‌ అభివృద్ధికి తాము అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. 2009 నుంచి 2014 వరకు మొదటిసారిగా ఆయన సీఎంగా పనిచేశారు. అబ్దుల్లా కుటుంబం నుంచి జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న మూడో తరం నాయకుడు ఒమర్ కావడం విశేషం. ఆయన తాతా షేక్ అబ్దుల్లా, అలాగే తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా సీఎంలుగా బాధ్యతలు చేపట్టారు. 

Also Read: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు!

ఇదిలాఉండగా.. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019లో రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత మొదటిసారిగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేసింది. ఎన్సీ 42, కాంగ్రెస్ 6, బీజేపీ 29 స్థానాల్లో గెలిచాయి. ఎన్సీకి ఆరుగురు స్వంతంత్ర్య అభ్యర్థులు సపోర్ట్ చేయడంతో దాని బలం 48కి చేరింది. అయితే ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన నేతృత్వంలో అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతాయే చూడాలి మరీ. 

Also Read: ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు రాదు!

Advertisment
Advertisment
తాజా కథనాలు